Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌తో యుద్ధ విమానాల ఒప్పందం ప్రసక్తే లేదు: రష్యా

పాకిస్థాన్‌తో ఎటువంటి రక్షణ సంబంధమైన ఒప్పందాలు చేసుకోలేదని, ఇకపై చేసుకునే ఆలోచన కూడా లేదని రష్యాలోని రోస్టెక్‌ కార్పొరేషన్‌ సీఈవో సెర్గీ కెమెజోవ్‌ స్పష్టంచేశారు. పాక్‌కు అధునాతన యుద్ధ విమానాల సరఫరాకు

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (12:07 IST)
పాకిస్థాన్‌తో ఎటువంటి రక్షణ సంబంధమైన ఒప్పందాలు చేసుకోలేదని, ఇకపై చేసుకునే ఆలోచన కూడా లేదని రష్యాలోని రోస్టెక్‌ కార్పొరేషన్‌ సీఈవో సెర్గీ కెమెజోవ్‌ స్పష్టంచేశారు. పాక్‌కు అధునాతన యుద్ధ విమానాల సరఫరాకు ఒప్పందం జరగలేదని, గతంలో రవాణా కోసం వినియోగించే హెలికాప్టర్‌ల సరఫరాకు చేసుకున్న ఒప్పందం ముగిసిందని తెలిపారు.
 
పాక్‌లో ఇటీవలి పాక్‌-రష్యా సంయుక్త రక్షణ కార్యక్రమాలు ఐఎస్‌, ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగం మాత్రమేనన్నారు. తమ సంయుక్త రక్షణ సన్నాహాలు భారత్‌కు వ్యతిరేకం కావని తెలిపారు. భారత-రష్యా మైత్రి ఎప్పటిలాగే ధృఢంగా కొనసాగుతుందని చెప్పారు. 
 
కాగా, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత అత్యాధునిక యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు రష్యాతో పాకిస్థాన్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వచ్చిన విషయంతెల్సిందే. ఈ అంశాన్ని సెర్గీ కెమెజోవ్ వద్ద ప్రస్తావించినపుడు పైవిధంగా సమాధానమిచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments