Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరక్టర్స్ బోర్డు నుంచి వైదొలగిన నీతా అంబానీ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (14:54 IST)
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు నుండి వైదొలిగారు. వారి స్థానంలో వారి పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్‌లకు అవకాశం కల్పించారు. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ ఆయిల్-టు-రిటైల్ సమ్మేళనానికి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
 
డైరెక్టర్ల బోర్డు వారి నియామకాన్ని సిఫార్సు చేసింది. దాని వాటాదారుల ఆమోదం పెండింగ్‌లో ఉంది. రిటైల్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ, మెటీరియల్స్ వ్యాపారాలతో సహా గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ కీలక వ్యాపారాలలో ముగ్గురు అంబానీ వారసులు పాల్గొంటున్నారు. వారు రిలయన్స్ కీలక అనుబంధ సంస్థల బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు.
 
ఇకపోతే.. డైరెక్టర్ల బోర్డు కూడా నీతా అంబానీ రాజీనామాను ఆమోదించింది. అయితే ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరవుతూనే ఉంటారు. తద్వారా కంపెనీ ఆమె సలహా ద్వారా ప్రయోజనం పొందడం కొనసాగిస్తుందని సంస్థ  ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments