Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యంతర బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లు-ఐదేళ్ల కాలం స్వర్ణయుగం

సెల్వి
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (13:49 IST)
మధ్యంతర బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రుణాలు మినహా రాబడికి రూ.30.80 లక్షల కోట్లు, ప్రణాళిక వ్యయం రూ.11.11 లక్షల కోట్లు.. అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అప్పులు : రూ.11.75 లక్షల కోట్లు, సవరించిన రెవన్యూ వ్యయం కోసం రూ. 44.90 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారత దేశ అభివృద్ధికి రాబోయే ఐదేళ్ల కాలం స్వర్ణయుగం కానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తమ సర్కారు కృషితో పదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగిందని చెప్పారు. 
 
పేదరిక నిర్మూలనకు రాబోయే రోజుల్లోనూ కృషి చేస్తామని, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్టుబడులకు స్వర్ణయుగంగా మారిందని నిర్మల చెప్పారు. విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత మధ్యంతర బడ్జెట్ లో రక్షణ శాఖకు రూ.6.2 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.  వందే భారత్ ట్రైన్లతో రైల్వేలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. మిగతా రైళ్ల బోగీలను కూడా వందేభారత్ స్థాయిలో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments