Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2000 నోటు రద్దు ఖాయం? భవిష్యత్తులో రూ.500 నోటే పెద్ద నోటు..

కొత్త నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. నల్ల ధనాన్ని వైట్‌గా మార్చుకుని అదీ రెండు వేల కొత్త నోట్లను భద్రంగా దాచుకున్న వారిని ఐటీ శాఖాధికారులు పట్టేసుకుంటున్నారు. ఇటీవలే టీటీడీ బోర్డు సభ్యుడు భ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (09:55 IST)
కొత్త నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. నల్ల ధనాన్ని వైట్‌గా మార్చుకుని అదీ రెండు వేల కొత్త నోట్లను భద్రంగా దాచుకున్న వారిని ఐటీ శాఖాధికారులు పట్టేసుకుంటున్నారు. ఇటీవలే టీటీడీ బోర్డు సభ్యుడు భారీ నగదు, బంగారంతో పట్టుబడగా, తాజాగా సుమారు రూ.93.52 లక్షల కొత్త రూ.2000 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
రాజస్థాన్‌లోని జైపూర్‌లో సోమవారం ఏడుగురి నుంచి ఈ మొత్తాన్ని పట్టుకున్నారు. సీఐడీకి అందిన పక్కా సమాచారంలో ఓ కారును అడ్డుకుని రూ.64 లక్షల డబ్బును సీజ్ చేశారు. ఇందులో రూ.58 లక్షలు కొత్త రూ.2000 నోట్లు కాగా మిగతా రూ.6 లక్షలు రూ.100 నోట్ల కట్టలేనని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో బికనీర్ వ్యాపార‌వేత్త నుంచి రూ.83 లక్షల కొత్త కరెన్సీని దోచుకున్న కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. త్వరలోనే రూ.2000 నోటును రద్దు చేస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త.. ఆర్ధిక నిపుణుడు ఎస్. గురుమూర్తి చెప్పిన మాటలు బడాబాబులకు చెమటలు పట్టించేలా ఉన్నాయి.

గురుమూర్తి ఏంచెబుతున్నారంటే, రానున్న ఐదేళ్లలో రూ.2000నోటు ఎప్పుడైనా రద్దుకావచ్చని.. రద్దు చేసేందుకే ఈనోటు తీసుకొచ్చారని తెలిపారు. అంతేకాకుండా  కొత్త వెయ్యి రూపాయల నోటు కూడా ఇకమీదట చెలామణీలోకిరాదని, దేశంలో ఐదొందల నోటే అతి పెద్ద నోటుగా ఉంటుందని గురుమూర్తి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments