Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిటైరింగ్ రూమ్స్ వచ్చేశాయ్..!

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (13:38 IST)
retiring rooms
భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. గతేడాది మార్చిలో లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రైల్వే సేవలు దశల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. మొదట కొన్ని స్పెషల్ ట్రైన్స్ మాత్రమే ప్రకటించిన రైల్వే ఆ తర్వాత రైళ్ల సంఖ్యను పెంచుతూ వస్తోంది. మరోవైపు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తోంది రైల్వే.
 
యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో టికెట్ బుకింగ్ తిరిగి ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో పాటు ఇటీవల రైళ్లల్లో ఇ-కేటరింగ్ సర్వీస్‌ను కూడా ప్రారంభించేందుకు అనుమతిచ్చింది. తాజాగా రిటైరింగ్ రూమ్స్, రైల్ యాత్రి నివాస్, హోటళ్లను తెరిచేందుకు భారతీయ రైల్వే అనుమతి ఇచ్చింది. స్థానిక పరిస్థితులు, ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్స్‌ని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్లలోని రిటైరింగ్ రూమ్స్ తెరవడంపై నిర్ణయం తీసుకునే అధికారాలను జోనల్ రైల్వేస్‌కి అప్పగించింది భారతీయ రైల్వే. 
 
ప్రస్తుతం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్ రైల్వే సేవలు కూడా దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. రిటైరింగ్ రూమ్స్ తెరవాలన్న విజ్ఞప్తులు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. 
retiring rooms
 
రైల్వే స్టేషన్లలోని రిటైరింగ్ రూమ్స్‌ను రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఏసీ, నాన్ ఏసీ సింగిల్, డబుల్, డార్మిటరీ లాంటి గదులు ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌లోనే బుక్ చేయొచ్చు. కనీసం 3 గంటల నుంచి గరిష్టంగా 48 గంటల వరకు రైల్వే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments