Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఎక్కాలంటే.. ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు 2 గంటలు ముందుగా..

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (11:03 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశంలో రైలు ప్రయాణం మరింత కఠినంకానుంది. విమానం ఎక్కేందుకు ఏవిధంగా అయితే ఎయిర్‌పోర్టుకు రెండు గంటలకు ముందుగా చేరుకుంటామో.. అలాగే, రైలు బయలుదేరే సమయానికి రెండు గంటలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వైద్యులు నిర్వహించే వైద్య పరీక్షల్లో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు తేలితేనే రైలు బోగీలోకి ఎక్కనిస్తారు. ఇలాంటి కఠిన నిబంధనలతో ఇకపై రైలు ప్రయాణం సాగనుంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా దేశంలో లాక్‌డౌన్ అమల్లోవుంది. ఈ కారణంగా రైల్వే శాఖ కూడా రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం సాగుతున్న రెండో దశ లాక్‌డౌన్ మే 3వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రైళ్ళ రాకపోకలు కొనసాగించాలన్న ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. 
 
అయితే, కఠిన ఆంక్షలతో రైళ్లను నడపాలని భావిస్తోంది. మే మూడో తేదీన లాక్‌డౌన్ తొలగించి, రైళ్లు నడిచేందుకు అనుమతులు లభిస్తే, రైళ్లలో ప్రయాణాలకు కొన్ని నిబంధనలు పాటించడం తప్పనిసరికానుంది. ఈ మేరకు పలు రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా తునిలోనూ ఇదే తరహా మాక్ డ్రిల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించారు.
 
రైలు ఎక్కాలంటే, ఎయిర్ పోర్టుకు వెళ్లినట్టుగా కనీసం 2 గంటల ముందే స్టేషన్‌కు చేరుకోవాల్సివుంటుంది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. ఆపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్యమూ లేదని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. 
 
ఇక బుకింగ్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవాలన్నా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ మేరకు రైల్వే స్టేషన్లలో ధర్మల్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తంమీద కరోనా వైరస్ తర్వాత ప్రతిదీ ఆంక్షలతో కూడుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments