Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతి బంపర్ ఆఫర్... ఎవరికి.. ఎలాంటి ప్రయోజనాలు?

Webdunia
ఆదివారం, 18 అక్టోబరు 2020 (17:44 IST)
దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థగా గుర్తింపు పొందిన మారుతి ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో భారీగా తమ కార్లు భారీ సంఖ్యలో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సీజనులో తమ కార్లు కొనుగోలు చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మారుతి రూ.11 వేలకు బెనిఫిట్స్ అందించనుంది. విటారా బ్రెజా, ఇగ్నిస్, ఎస్ క్రాస్, ఎర్టిగా, సెలెరియో, ఆల్టో, వ్యాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో, ఈకో, బాలెనో, స్విఫ్ట్ డిజైర్, ఎక్స్ఎల్6 మోడళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.  
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది కొత్త కారు కొనే సమయంలో ఈ మేరకు ప్రయోజనం పొందవచ్చని మారుతీసుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వివరించారు. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కోటి మంది ఉద్యోగులు ఈ స్పెషల్ ఆఫర్‌కు అర్హులని తెలిపారు. పండుగ సీజన్లలో ప్రభుత్వాలు ఉద్యోగులకు అందించే ఎల్టీసీ సదుపాయానికి అదనంగా తాము బెనిఫిట్స్ అందిస్తున్నామని చెప్పారు.
 
ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు కేంద్రం పలు చర్యలు ప్రకటించిందని, అందుకు దన్నుగా తమవంతు ఆఫర్ ప్రకటించామని మారుతీసుజుకి వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments