Webdunia - Bharat's app for daily news and videos

Install App

86 శాతం కరెన్సీ నోట్ల రద్దు దరిద్రమైన నిర్ణయం : మన్మోహన్ సింగ్

సరిగ్గా యేడాది క్రితం అంటే 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైన దోపిడీకి తలుపులు బార్లా తెరిచినట్టయిందని మాజీ ప్రధాని, ఆ

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (08:42 IST)
సరిగ్గా యేడాది క్రితం అంటే 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైన దోపిడీకి తలుపులు బార్లా తెరిచినట్టయిందని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. 
 
దేశంలో పెద్ద నోట్ల రద్దు చేసి బుధవారానికి ఓ యేడాది పూర్తికానుంది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులోభాగంగా, స్వయానా ఆర్థికవేత్త అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఘాటుగానే స్పందించారు. 
 
ప్రజాస్వామ్యానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు నవంబర్ 8 బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రపంచంలో ఏ దేశం కూడా 86 శాతం కరెన్సీని రద్దు చేసేంత దరిద్రమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. తాను పార్లమెంట్‌లో చెప్పినట్టు ఇది వ్యవస్థీకృత, చట్టబద్దమైన దోపిడీ అంటూ వ్యాఖ్యానించారు. డీమానిటైజేషన్, జీఎస్టీలు ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీశాయన్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments