Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందసార్లు చెప్పినా అదే తప్పు చేస్తే ఇలాగే మడతపడుతుంది మరి

డిట్ కార్డు సమాచారం, బ్యాంకు ఖాతాల సమాచారం, డెబిట్ కార్డు సమాచారం కూడా ఎవరికీ చెప్పవద్దని, చివరు బ్యాంకునుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పినా నమ్మవద్దని, ఇలాంటి సైబర్ దొంగనాకొడుకుల ఉచ్చులో పడిపోయి వాళ్లడిగిన సమాచారం ఇచ్చేసి, పాస్ వర్డ్‌ల వంటి సమాచారం చ

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (03:09 IST)
జీవితంలో ఎప్పుడూ పేపర్లు చదవం. ఒకవేళ చదివినా సినిమా పేజీ లేక క్రికెట్ న్యూస్ చదివేసి  పేజీలు అలా తిప్పేస్తాం. టీవీలో పొరపాటుగా కూడా వార్తలను ఫాలో కాము. ఎంత సేపూ సినిమాలు, సీరియల్స్, పాటలు, ప్యాషన్ టీవీలతోనే బతుకు సాగిస్తుంటాం. అంతేగానీ ఏ పేపర్లో అయినా సరే బిజినెస్ పేజీల్లో మన నిత్య జీవితానికి సంబంధించిన అమూల్య సమాచారం దాగి ఉంటుందని, దాన్ని ఫాలో అయితే భవిష్యత్తులో ఫ్రాడ్ జరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని తెలియదు. క్రెడిట్ కార్డు సమాచారం, బ్యాంకు ఖాతాల సమాచారం, డెబిట్ కార్డు సమాచారం కూడా ఎవరికీ చెప్పవద్దని, చివరు బ్యాంకునుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పినా నమ్మవద్దని, ఇలాంటి సైబర్ దొంగనాకొడుకుల ఉచ్చులో పడిపోయి వాళ్లడిగిన సమాచారం ఇచ్చేసి, పాస్ వర్డ్‌ల వంటి సమాచారం చెప్పేసి తర్వాత గుండు కొట్టింటుకునే పనులు చేయవద్దంటే వినరు. ఇప్పుడు అలాంటి పొరపాటే చేసి 50 వేల రూపాయలు పోగొట్టుకున్న యువకుడు లబో దిబో మంటున్నాడు. 
 
చిత్తూరు జిల్లాలోని పెద్ద తిప్పసముద్రంకి చెందిన పుంగనూరు శ్రీనివాసులు అనే యువకుడికి ఇలాగే సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తే తన బ్యాంకు ఖాతాకు చెందిన వివరాలు చెప్పేశారు. సైబర్ నేరగాళ్ల పంట పండింది. రెండు దఫాలు 50 వేలు లాగేశారు. డబ్బు ఖాతాలోంచి వెళ్లిపోయినా సరే అతడికేమీ తెలియదు. 
 
శ్రీనివాసులుకు స్థానిక ఎస్బీఐలో ఖాతా ఉంది. అతని పేరిట కుటుంబ సభ్యుల బంగారు నగలు తాకట్టులో ఉన్నాయి. మహిళా సంఘం నుంచి అతని తల్లి మంగమ్మ, భార్య శశకళ, పిన్ని అనసూయకు మంజూరైన 1.50 లక్షల డబ్బును తీసుకొని నగలు విడిపించేందుకు అతని ఖాతాలో జమ చేశారు. అలాంటి తరుణంలో ఈ నెల 24న శ్రీనివాసులుకు 9534563929, 8677852060 నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. కార్డు బ్లాక్ అయిందని, వెంటనే రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉందని ఆ ఫోన్ల ద్వారా అందిన సమాచారం. దాంతో కంగారు పడిన శ్రీనివాసులు వారడిగినట్టుగా 16 అంకెల కార్డు నంబర్, దానివెనకాల ఉండే సీవీవీ నంబర్‌తో సహా వివరించాడు.
 
ఆ తర్వాత మరుసటి రోజు వెళ్లి బ్యాంకు ఖాతాలో నిలువ ఉన్న సొమ్మును పరిశీలించగా 50 వేల రూపాయల తక్కువగా ఉన్నాయి. వివరాలు తీసుకోగా, రెండు విడతలుగా ఆ సొమ్ము తన ఖాతా నుంచి డ్రా చేసినట్టు గుర్తించాడు. మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు ట్రూ కాలర్ ద్వారా తనకొచ్చిన ఫోన్ నంబర్లను పరిశీలించి మరింత విస్మయపోయాడు. తన ఖాతా నుంచి డ్రా చేసిన సొమ్మును ఎయిర్‌టెల్‌ మని, వైవా టెక్నాలజీ సోలుకు బదలాయించినట్లు తేలింది. వెంటనే జరిగిన మోసాన్ని స్థానిక మేనేజర్‌కు మంగళవారం ఫిర్యాదు చేసాడు. ఇప్పుడు ఆ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
 
ఇటీవలి కాలంలో ఎస్బీఐ ఖాతాదారులే ఎక్కువగా ఇలాంటి ఫోన్లు రిసీవ్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కలిగిన ఖాతాదారులను ఆ బ్యాంకు అధికారిగానీ మరెవరుగానీ ఎలాంటి నంబర్ అడగరు. పైగా అనేక సందర్భాల్లో ఎస్బీఐ ఇలాంటి వాటి గురించి ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ మేసేజ్ లు పంపిస్తుంటుంది. ఖాతాదారులను బ్యాంకు నుంచి ఎలాంటి వివరాలు కోరదని, ఎవరడిగినా ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అనేక సందర్భాల్లో ఎస్బీఐ స్పష్టం చేసింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments