Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది...

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (17:32 IST)
వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.21 ఎగబాకింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.1,796.50కు చేరింది. ముంబైలో ఈ ధర రూ.1,749గా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సవరణలు చేసినట్లు ఇంధన రిటైల్‌ కంపెనీలు తెలిపాయి. అదేసమయంలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.903 వద్ద స్థిరంగా ఉంది.
 
మరోవైపు విమాన ఇంధన ధరల్లో ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్‌ కంపెనీలు మరోసారి కోత విధించాయి. దిల్లీలో ఒక్కో కిలోలీటర్‌ ధర రూ.5,189.25 తగ్గి రూ.1,06,155.67కు చేరింది. ఏటీఎఫ్‌ ధరను తగ్గించడం ఈ నెలలో ఇది రెండోసారి. నవంబర్‌ ఒకటో తేదీన కిలోలీటర్‌పై రూ.6,854.25 తగ్గిన విషయం తెలిసిందే. అంతకుముందు జులై 1 నుంచి నాలుగు దశల్లో కంపెనీలు ఏటీఎఫ్‌ ధరను రూ.29,391.08 పెంచాయి. తాజాగా రెండుసార్లు తగ్గించడంతో విమానయాన సంస్థలపై కొంత మేర భారం తగ్గినట్లయింది.
 
మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 నెలలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62 దగ్గర ఉంది. చివరిసారి ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన 2022 మేలో ఇంధన రిటైల్‌ కంపెనీలు ధరల్ని సవరించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments