Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణేలో భారీ ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన లాట్టే

ఐవీఆర్
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (21:45 IST)
అంతర్జాతీయ విస్తరణ ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచే అతిపెద్ద అత్యాధునిక ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలోని పుణేలో ప్రారంభించడం గర్వంగా ఉందని లాట్టే ప్రకటించింది. లాట్టే (LOTTE)  గ్రూప్‌ ఛైర్మన్‌ డాంగ్ బిన్ షిన్‌తో కలిసి ఈ కేంద్రాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి  గౌరవ శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్‌లో రిపబ్లిక్‌ ఆఫ్ కొరియా రాయబారి సీయోంగ్ హొ లీ, రాష్ట్ర ప్రభుత్వాధికారులు, కొరియా ప్రభుత్వాధికారులు, స్థానిక కొరియా అసోసియేషన్‌, సమూహ సభ్యులు, లాట్టే ఇండియా వ్యాపార ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ కేంద్రం భారతీయ మార్కెట్‌పై లాట్టే నిబద్ధత, ఆవిష్కరణలపై వ్యూహాత్మక దృష్టి, సుస్థిర వృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది.
 
50 మిలియన్ లీటర్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ఈ కేంద్రాన్ని రానున్న రోజుల్లో 100 మిలియన్‌ లీటర్ల వరకు విస్తరించనున్నారు. భారతదేశంలో ముఖ్యంగా తీవ్రమైన వేసవిలో పెరుగుతున్న ఐస్‌క్రీమ్ డిమాండ్‌ తీర్చేలా పుణే ప్లాంటును రూపొందించారు. విభిన్న రకాల ఐస్‌క్రీమ్ కోసం ప్రస్తుతం 9 ఉత్పత్తి విభాగాలున్నాయి. దీనిని 16కు విస్తరించనున్నారు. అత్యంత వేగవంతమైన మెషీన్లు, సెకండరీ ప్యాకేజింగ్ కోసం పూర్తి ఆటోమ్యాటిక్‌ రోబొటిక్‌ వ్యవస్థలు సామర్థ్యాన్ని, అత్యుత్తమ నాణ్యతనూ నిర్థారిస్తాయి. ఈ అత్యాధునిక తయారీ కేంద్రం ద్వారా రానున్న మూడేళ్ల కాలంలో హ్యావ్‌మోర్‌ వృద్ధి రేటు వేగవంతమవుతుంది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ తయారీ కేంద్రం రానున్న రెండేళ్ల కాలంలో 1000 మందికి ఉపాధి కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు చక్కని ఊతంగా నిలుస్తుంది.
 
ఈ సందర్భంగా లాట్టే గ్రూప్‌ ఛైర్మన్‌ డాంగ్ బిన్ మాట్లాడుతూ, "ఉత్కృష్టత, ఆవిష్కరణలపై నిబద్ధతతో సదా మా ప్రయాణం సాగింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ప్రారంభించడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇది లాట్టే ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. భారత మాకు ముఖ్యమైన మార్కెట్‌,  మా అంతర్జాతీయ కార్యకలాపాల్లో ఇది అంతర్భాగం. 2004లో లాట్టే చాకో పైతో భారతీయ కన్ఫెక్షనరీ మార్కెట్‌లో ప్రవేశించి, 2017లో హ్యావ్‌మోర్‌తో ఐస్ క్రీంల్లోకి విస్తరణ ద్వారా మా వృద్ధి దేశపు వేగవంతమైన ఆర్థిక ప్రగతికి అద్దంగా నిలుస్తోంది. భారతదేశంలో అత్యంత ప్రియమైన ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌గా హ్యవ్‌మోర్‌ను నిలిపేందుకు మా పుణే సదుపాయం 16 ఉత్పత్తి కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా సాటిలేని నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తుంది. హ్యావ్‌మోర్‌, లాట్టే ఇండియా ఈ సంవత్సరం విలీనం కానున్నాయి. ఆవిష్కరణ, పెట్టుబడి,  ప్రపంచస్థాయి ఉత్పత్తులతో భారతీయ కస్టమర్లను ఆహ్లాదపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము" అన్నారు.
 
“ఇక్కడ భారీ ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా మేము మా అంతర్జాతీయ కార్యకలాపాల విస్తరణతో పాటు ఇండియాలో హ్యావ్‌మోర్‌ ఐస్‌క్రీమ్‌ వారసత్వాన్ని బలోపేతం చేయడం, పెంచడం కూడా చేస్తున్నాం. హ్యావ్‌మోర్‌ను భారతదేశంలోని ప్రతీ మూలలో ఒక విశ్వసనీయ, అత్యంత ప్రియమైన పేరుగా మార్చాలన్న మా వ్యూహాత్మక దృష్టికి ఈ అడుగు ప్రతిబింబం. వినూత్న ఉత్పత్తుల శ్రేణి, ఆధునిక పంపిణీ విధానాలు, నాణ్యతపై నిబద్ధత ద్వారా భారత్‌లో విస్తరిస్తూ వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యతను కొనసాగిస్తాం” అన్నారు లాట్టే వెల్‌ఫుడ్‌ కంపెనీ లిమిటెడ్‌ సీఈఓ పాల్ యి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments