Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లు నడుస్తాయో లేదో తెలియదుకానీ... బుకింగ్సన్నీ హౌస్‌ఫుల్

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:06 IST)
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా రైళ్ళ రాకపోకలు బంద్ అయ్యాయి. అయితే, లాక్‌డౌన్ గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. 15వ తేదీ నుంచి రైళ్ళ రాకపోకలు ప్రారంభమవుతాయనే ప్రచారం సాగుతోంది. అయితే, రైళ్ళు నడుస్తాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ, ఈ నెల 15, 16 తేదీల్లో మాత్రం రైళ్ల బుక్కింగ్స్ అన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. 
 
ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ ద్వారా నాలుగు రోజుల క్రితమే రైల్ రిజర్వేషన్ ప్రారంభంకాగా, 15, 16 తేదీలకు దాదాపు అన్ని రైళ్లకూ బుకింగ్స్ పూర్తికాగా, కొన్ని రైళ్లలో 100 వరకూ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చి, తిరిగి వెనక్కు వెళ్లలేకపోయిన వారు ఈ టికెట్లను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఒకవేళ లాక్‌డౌన్ కొనసాగినట్లయితే, ఆన్‌లైన్‌లోనే టికెట్ల రద్దునకు అవకాశం ఉండటంతో, ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో టికెట్లను ప్రయాణికులు బుక్ చేసుకుంటున్నారు. ఇక ఈ వేసవిలో పిల్లా జెల్లాతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్న వారిలో అత్యధికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడంతో, కొన్ని రైళ్లలో మే, జూన్ నెల ప్రయాణాలకు టికెట్లు కనిపిస్తున్నాయి. 
 
ఇక రైళ్లు తిరుగుతాయా? తిరగవా? అన్న విషయం 10వ తేదీ తర్వాత కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, దేశంలో కరోనా వ్యాప్తి తదితరాలను సమీక్షించిన తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments