ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ కన్సంప్షన్ ఫండ్ ప్రారంభం

ఐవీఆర్
గురువారం, 30 అక్టోబరు 2025 (21:48 IST)
భారతదేశంలోని ప్రఖ్యాత ఫండ్ హౌస్‌లలో ఒకటైన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, ఎల్ఐసి ఎంఎఫ్ కన్సంప్షన్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది కన్సంప్షన్ (వినియోగ) థీమ్‌ను అనుసరించే ఒక ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క న్యూ ఫండ్ ఆఫర్ అక్టోబర్ 31న ప్రారంభమై, నవంబర్ 14, 2025న ముగుస్తుంది. నిరంతర అమ్మకం, తిరిగి కొనుగోలు కోసం ఈ స్కీమ్ నవంబర్ 25, 2025న తిరిగి తెరవబడుతుంది. ఈ స్కీమ్‌కు ఫండ్ మేనేజర్లుగా శ్రీ సుమిత్ భట్నాగర్, శ్రీ కరణ్ దోషి వ్యవహరిస్తారు. దీనికి నిఫ్టీ ఇండియా కన్సంప్షన్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (TRI) బెంచ్‌మార్క్‌గా ఉంటుంది.
 
వినియోగం, వినియోగ సంబంధిత రంగాలు లేదా అనుబంధ రంగాలలో నిమగ్నమైన కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలతో కూడిన యాక్టివ్‌గా నిర్వహించబడే పోర్ట్‌ఫోలియో ద్వారా దీర్ఘకాలిక మూలధన వృద్ధిని అందించడం ఈ స్కీమ్ లక్ష్యం.
 
దేశీయ వినియోగ ఆధారిత డిమాండ్ (డొమెస్టిక్ కన్సంప్షన్-డ్రివెన్ డిమాండ్) నుండి ప్రయోజనం పొందగల కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో ఈ ఫండ్ తన మొత్తం ఆస్తులలో 80-100% కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమిక కన్సంప్షన్ థీమ్ వెలుపల 20% వరకు ఆస్తులను పెట్టుబడి పెట్టే విచక్షణాధికారం ఫండ్ మేనేజర్‌కు ఉంటుంది. అంతేకాకుండా, ఈ స్కీమ్ అన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ల (లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్) కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. అయితే, స్కీమ్ యొక్క పెట్టుబడి లక్ష్యం నెరవేరుతుందని ఎటువంటి హామీ లేదు.
 
ఈ ఎన్ఎఫ్ఓ (NFO)పై ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఆర్.కె. ఝామాట్లాడుతూ, రాబోయే సంవత్సరాల్లో భారతదేశం గణనీయమైన వినియోగ వృద్ధికి సిద్ధంగా ఉన్నందున మేము ఈ కన్సంప్షన్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నాము. వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి, ఆరోగ్యకరమైన పని-వయసు జనాభా, పెరుగుతున్న తలసరి ఆదాయం, వేగవంతమైన పట్టణీకరణ, డిజిటలైజేషన్ వంటి అంశాలు భారతదేశ వినియోగ గాథను బలంగా నిలబెడుతున్నాయి. ఈ పెద్ద మధ్యతరగతి విభాగం భారతదేశాన్ని ఒక వినియోగ శక్తిగా మార్చే అవకాశం ఉంది. అందువల్ల, మా ఈ కొత్త ఫండ్ రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ వృద్ధి చక్రాన్ని(సైకిల్) అందిపుచ్చుకోవడానికి మెరుగైన అవకాశాన్ని అందిస్తోంది.
 
ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్-ఈక్విటీ శ్రీ యోగేష్ పాటిల్ మాట్లాడుతూ, ప్రపంచ క్రమంలో భారతదేశం యొక్క వ్యూహాత్మక స్థానం, బలమైన ఫండమెంటల్స్, కొనసాగుతున్న వ్యవస్థాగత సంస్కరణలు, అద్భుతమైన జీడీపీ వృద్ధిని బట్టి చూస్తే... భారతదేశ వినియోగ వృద్ధి (కన్సంప్షన్ బూమ్) ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది.
 
వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, భారతదేశం ప్రస్తుతం విచక్షణతో కూడిన వ్యయాలలో (డిస్క్రిషనరీ స్పెండింగ్) పెరుగుదలను, వివిధ కేటగిరీలలో ప్రీమియమైజేషన్ (అధిక నాణ్యత, ఖరీదైన వస్తువుల వైపు మొగ్గు) వైపు స్పష్టమైన ధోరణిని చూస్తోంది. ఆకాంక్షలు పెరుగుతున్న మధ్యతరగతి, పెరుగుతున్న డిస్పోజబుల్ ఆదాయాలు (ఖర్చు చేయగల ఆదాయం), మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు ఈ మార్పుకు ఇంధనంగా పనిచేస్తున్నాయి. ఈ అంశాలన్నీ కలిసి, ముఖ్యంగా ప్రీమియం, లైఫ్‌స్టైల్ విభాగాలలో 'వినియోగం' (కన్సంప్షన్) అనే థీమ్‌ను ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఒక బలమైన, దీర్ఘకాలిక అంశంగా మార్చవచ్చు.
 
ఎన్ఎఫ్ఓ సమయంలో, కనీస దరఖాస్తు మొత్తం స్విచ్-ఇన్ రూ. 5,000/- ఆపైన రూపాయి గుణిజాల్లో ఉండాలి. కనీస డైలీ ఎస్ఐపి (SIP) మొత్తం రూ. 100/-, నెలవారీ ఎస్ఐపి రూ. 200. కనీస త్రైమాసిక (క్వార్టర్లీ) ఎస్ఐపి మొత్తం రూ. 1,000. స్కీమ్ తిరిగి తెరిచిన తర్వాత (రీ-ఓపెనింగ్) ఎస్ఐపి ప్రారంభ తేదీ వర్తిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments