Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ అనువాద దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న కూ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (20:59 IST)
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ - భారతీయులు తమ మాతృభాషల్లో కనెక్ట్ అవ్వడానికి, వ్యక్తపరుచుకోవడానికి అధికారం ఇస్తుంది. ఇప్పుడు ఎనిమిది విభిన్న భారతీయ భాషలలో కంటెంట్ యొక్క రియల్ టైం అనువాదాన్ని ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
 
ఈ ఫీచర్ హిందీ, మరాఠీ, కన్నడ, తమిళం, అస్సామీ, బెంగాలీ, తెలుగు, ఇంగ్లీషులలో కూని ఆటోమేటిక్‌గా ట్రాన్సలేట్ చేస్తుంది. తద్వారా డిజిటల్ రీచ్‌‌ను పెంపొందిస్తుంది. భారతదేశాన్ని ప్రతిబింబించే భాషల ద్వారా సంభాషణలు మరియు ఆలోచనా వ్యక్తీకరణలను ప్రోత్సహిస్తుంది. ఈ టెక్ ఆధారిత అనువాద ఫీచర్‌‌ను ప్రారంభించిన ప్రపంచంలో మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కూ.
 
బహుభాషా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌‌గా, కూ అన్ని వర్గాల యూజర్లకు మరియు ప్రముఖులను ఆకర్షించింది. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, క్రీడా తారలు, ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు ప్లాట్‌ఫారమ్‌‌ని చురుకుగా ప్రభావితం చేస్తున్న వారు, ఇప్పుడు దాని అనువాద ఫీచర్ వారి కమ్యూనిటీ రీచ్‌ని విస్తరించడానికి, సజావుగా పాల్గొనడానికి మరియు విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి సహాయ పడుతుంది.
 
బహుభాషలలో ప్రతిబింబిస్తున్న దీని గురించి, కూ ప్రతినిధి మాట్లాడుతూ, “భారతదేశం ఒక ప్రత్యేకమైన దేశం. మాకు వేలాది భాషలు మరియు మాండలికాలు ఉన్నాయి. చాలా ఉత్పత్తులు యూజర్లు ప్రపంచ భాష మాట్లాడుతాయని అనుకుంటాయి - కానీ అది భారతదేశంలో ఎన్నటికీ నిజం కాదు. భారతీయులు తమ మాతృభాషలో అనుసంధానించడానికి మరియు నిమగ్నమవ్వడానికి ఒక ప్లాట్‌ఫారమ్‌‌ని అందించడంతో పాటు, మేము ఇప్పుడు కూ ద్వారా ఏకైక మార్గంలో అనువాద శక్తిని అందించడం ద్వారా వారి అనుభవాన్ని మెరుగుపరుస్తున్నాము.
 
దేశవ్యాప్తంగా విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి ప్రముఖ వ్యక్తులు ఈ ఫీచర్‌‌ని విజయవంతంగా ఎలా ఉపయోగించుకుంటున్నారో చూడడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రపంచంలో మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ భారతీయుల కోసం ఇలాంటి ఫీచర్ ని సృష్టించలేదు. భారతీయుల కోసం, భారతీయుల చేత నిర్మించిన భారతదేశపు మొదటి వేదికగా మేము సంతోషిస్తున్నాము!”
 
ప్రారంభించినప్పటి నుండి కేవలం 16 నెలల వ్యవధిలో, కూ 1 కోటికి పైగా డౌన్‌లోడ్‌లను సంపాదించింది, 50% పైగా యూజర్లు హిందీలో చురుకుగా కూ చేస్తున్నారు. భవిష్యత్తులో 10 కోట్ల డౌన్‌లోడ్‌లను లక్ష్యంగా చేసుకోవడంపై ప్లాట్‌ఫాం దృష్టి సారించింది
 
స్థానిక భాషలలో వ్యక్తీకరణ శక్తి అపారంగా ఉన్నందున, కూ ఇప్పుడు భవిష్యత్తులో 25 ప్రాంతీయ భాషలను కవర్ చేయడానికి తన భాషా సమర్పణలను విస్తరించాలని చూస్తోంది. తద్వారా ఇంటర్నెట్ యూజర్లు విభిన్న సంస్కృతులు, ఆలోచనలు మరియు అభిప్రాయాలను పంచుకునే వేదికను పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments