Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 66 వేల ఏటీఎంలు మాత్రమే పని చేస్తున్నాయి... ఏటీఎం ఇండస్ట్రీ

పెద్ద నోట్ల రద్దులో అత్యంత కీలకమైన ఘట్టం.. రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు డిసెంబర్ 30 శుక్రవారంతో ముగిసిపోయింది. కానీ, భారత రిజర్వు బ్యాంకులో మాత్రం మార్చి 31వ తేదీ వరకు డిపాజిట్ చ

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (11:30 IST)
పెద్ద నోట్ల రద్దులో అత్యంత కీలకమైన ఘట్టం.. రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే గడువు డిసెంబర్ 30 శుక్రవారంతో ముగిసిపోయింది. కానీ, భారత రిజర్వు బ్యాంకులో మాత్రం మార్చి 31వ తేదీ వరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ లోపల ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సరిపడ నగదు విషయంలో ప్రభుత్వ హామీ నెరవేరేలా కనిపించడం లేదు. 
 
దేశీయంగా ఉన్న ఏటీఎంలో కేవలం 30 శాతం మాత్రమే నగదును అందిస్తున్నాయని, మిగతా రెండు వంతులకు పైగా ఏటీఎంలు నోక్యాష్ బోర్డులనే వెక్కిరిస్తున్నట్టు వెల్లడైంది. దీంతో ఈ ఏటీఎంలు ఉన్నా ఒకటే లేకపోయినే ఒకటే అన్నచందాగా మారాయి. బ్యాంకులు సైతం కస్టమర్లకు నగదును తమ బ్రాంచ్ కార్యాలయాల నుంచే అందిస్తున్నాయని ఏటీఎంలలో మాత్రం నగదు నింపడం లేదని తెలిసింది. 
 
కేవలం 30 శాతం అంటే 66,000 ఏటీఎంలు మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నాయని ఏటీఎం ఇండస్ట్రి కాన్ఫడరేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ పటేల్ తెలిపారు. రెండు నెలల డీమోనిటైజేషన్ కాలంలో కేవలం 20 శాతం ఏటీఎంలలోనే రెగ్యులర్‌గా నగదును నింపినట్టు ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజూ రూ.7-8 లక్షల వరకు ఏటీఎంలలో నగదును నింపేవారని, కానీ నోట్ల రద్దు అనంతరం రోజుకు కేవలం రూ.2-3 లక్షల నగదునే నింపుతున్నట్టు తెలిపారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments