Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీమియం ప్లాన్‌ల విడుదలతో సబ్‌స్క్రిప్షన్ మార్కెట్‌ను పునర్నిర్వచించేందుకు సిద్ధమైన జియో సినిమా

ఐవీఆర్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (19:51 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అద్భుతమైన విజయాన్ని, అవార్డు గెలుచుకున్న వినోదాన్ని అందించడంతో, జియో సినిమా ప్రతి భారతీయ కుటుంబంలో ప్రీమియం మనోరంజనకు ఒక గమ్యస్థానంగా గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు, పరికరాలకు పరిమితులు, తక్కువ-నాణ్యత వీడియో, అధిక-ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తదితర వినియోగదారుని కీలక సమస్యలను పరిష్కరిస్తూ, జియో సినిమా తన కొత్త సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ‘జియో సినిమా ప్రీమియం’ను ప్రకటించింది. మార్కెట్‌ను సరికొత్తగా నిర్వచించే రూ.29 నెలకు ప్రారంభమయ్యే కొత్త ప్లాన్‌లు గరిష్టంగా 4కె నాణ్యత, ఆఫ్‌లైన్ వీక్షణ ఎంపికలలో ప్రకటన రహిత అనుభవాన్ని అందిస్తాయి. సభ్యులు కనెక్ట్ చేయబడిన టీవీలతో సహా ఏదైనా పరికరంలో ప్రత్యేకమైన సిరీస్, సినిమాలు, హాలీవుడ్, కిడ్స్ అండ్ టీవీ వినోదాన్ని వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.
 
భారతీయ నివాసాలలో మల్టీ-సెగ్మెంట్ వినియోగంపై దృష్టి సారించి, ఒకేసారి 4 స్క్రీన్‌ల యాక్సెస్ అదనపు ప్రయోజనాన్ని అందించే ‘ఫ్యామిలీ’ ప్లాన్ నెలకు రూ.89 ధరను ప్రకటించారు. ఇప్పటికే జియో సినిమా ప్రీమియం సభ్యులుగా ఉన్నవారు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ‘ఫ్యామిలీ’ ప్లాన్ అందించే అన్ని అదనపు ప్రయోజనాలను పొందుతారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా స్పోర్ట్స్ కంటెంట్, వేలాది గంటల వినోద కంటెంట్ దాని యాడ్-సపోర్టెడ్ ఆఫర్‌లో భాగంగా ఉచితంగా అందుబాటులో కొనసాగుతుంది. జియో సినిమా ప్రీమియం సభ్యులు వీటికి ప్రత్యేక యాక్సెస్‌ను పొందుతారు.
 
స్థానిక భాషలలో అంతర్జాతీయ టాప్ కంటెంట్: ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోలు- పీకాక్, హెచ్‌బీఓ, పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ భాగస్వామ్యంతో హాలీవుడ్ నుంచి అతిపెద్ద గ్లోబల్ సిరీస్, సినిమా ప్రీమియర్‌లు వీక్షించవచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఒపెన్‌హైమర్, బార్బీ వంటి టాప్ టైటిల్స్‌ను హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ అందుబాటులో ఉంటాయి.
 
హోల్‌సమ్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్: మోటు పత్లు, శివ, రుద్ర నుంచి పోకీమాన్, పెప్పా పిగ్ అండ్ పా పాట్రోల్ వరకు టైటిల్స్‌తో కూడిన భారతీయ, అంతర్జాతీయ టూన్‌ల విస్తృత ఎంపికలు చేసుకునేందుకు అవకాశం కల్పించే కిడ్స్ & ఫ్యామిలీ హబ్ వేలాది గంటల టాప్-నాణ్యమైన సినిమాలు, సిరీస్‌లను అందిస్తుంది. జియో సినిమా పేరెంటల్ కంట్రోల్ ఫీచర్‌లు కంటెంట్ వినియోగం కోసం సురక్షితమైన స్పేస్‌ను కూడా అందిస్తుంది.
 
జానర్-నిర్వచించే ఒరిజినల్స్- బ్లాక్‌బస్టర్ సినిమాలు: రణ్‌నీతి: బాలాకోట్ & బియాండ్(జిమ్మీ షెర్గిల్, లారా దత్తా, ఆశిష్ విద్యార్థి), మర్డర్ ఇన్ మాహిమ్(విజయ్ రాజ్, అశుతోష్ రాణా), పిల్(రితీష్ దేశ్‌ముఖ్) వంటి చక్కని ప్రజాదరణ పొందిన ఒరిజినల్ సిరీస్‌లతో సహా మరెన్నింటినో వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. జియోసినిమా ప్రీమియం సభ్యులు అసుర్, తాలీ & కాలకూట్ వంటి భారతదేశంలోని అత్యంత ఇష్టపడే కొన్ని ఒరిజినల్స్‌తో పాటు, ప్రతి నెలా టాప్-రేటెడ్ సిరీస్ ప్రీమియర్‌లకు యాక్సెస్ పొందుతారు. ప్లాట్‌ఫారమ్ మే నుంచి ప్రతి నెలా జరా హాట్కే జరా బచ్కే పేరిట బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ ప్రీమియర్‌లను అందించే వాగ్దానాన్ని చేస్తుంది.
 
టీవీ కన్నా ముందే ప్రసారం & లైవ్ ఛానెళ్లు: తమ టెలివిజన్‌లో ప్రసారం అయ్యేందుకు ముందుగానే సీరియళ్లను సభ్యుల కోసం అందుబాటులో ఉంచడంతో పాటు కలర్స్, నికెలోడియన్, స్థానిక భాషా ఛానెళ్లను మొత్తం కలర్స్ సూట్ నుంచి తమకు ఇష్టమైన కంటెంట్‌కి ముందస్తుగా వీక్షించగలుగుతారు. అదనంగా, వయాకామ్ 18 నెట్‌వర్క్ నుంచి 20+ టీవీ ఛానెళ్లు ప్రసారాలను చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.
 
జియో సినిమా వినియోగదారులను, “అయితే ఈ రోజు ఏ ప్లాన్?” అని అడిగే అధిక-డెసిబెల్, చక్కని ప్రశంసలు అందుకున్న క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ జియో సినిమా ప్రీమియం ప్రధాన ప్రయోజనాలను హైలైట్ చేస్తుంది. వారి ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రణాళికను ఎంచుకునే సమయంలో నేటి వినియోగదారుల ఎదుర్కొంటున్న బాధలను వ్యంగ్యంగా చూపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments