Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ ప్రేక్షకుల కోసం అత్యద్భుతమైన హాలీవుడ్ కంటెంట్‌ను అందిస్తున్న జియో సినిమా

ఐవీఆర్
సోమవారం, 10 జూన్ 2024 (18:08 IST)
అద్భుతమైన అంతర్జాతీయ కంటెంట్‌ను భారతీయ ప్రేక్షకులకు అందిస్తూ మరెవ్వరికి సాధ్యం కాని రీతిలో దూసుకుపోతోంది జియో సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన జియో సినిమా ఇప్పుడు అంతర్జాతీయ కంటెంట్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టైన బ్లాక్ బస్టర్ సినిమాలు, విమర్శకుల ప్రశంసలు పొందిన వెబ్ సిరీస్‌లను అందిస్తుంది. హెచ్.బి.ఓ, పీకాక్ హబ్ లాంటి గ్లోబల్ నెట్ వర్క్ నుంచి ప్రీమియం కంటెంట్‌ను జియో సినిమా అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన గేమ్ ఆఫ్ త్రోన్స్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఎస్1, సక్సెషన్, ఓపెన్ హైమర్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7, బార్బీ, లాస్ట్ ఆఫ్ అజ్ లాంటి అద్భుతమైన సిరీస్‌లు హాలీవుడ్ కంటెంట్‌లో భాగంగా ఉన్నాయి.
 
అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 జియో సినిమాలో జూన్ 17 నుంచి అందుబాటులో ఉండనుంది. వారానికో ఎపిసోడ్ చొప్పున ప్రతీ సోమవారం ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ జియో సినిమాలో యాడ్ ఫ్రీ కంటెంట్‌గా అందుబాటులో ఉండడంతో పాటు.. ప్రాంతీయ భాషలైన హిందీ, మరాఠి, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాళీ భాషల్లో ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉండనుంది.
 
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన అంతర్జాతీయ కంటెంట్ మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకుని నాన్ స్టాప్ ఎంటర్టైన్‌మెంట్‌ను అందిస్తోంది జియో సినిమా. హాలీవుడ్ కంటెంట్‌తో పాటు కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్, ప్రతీ జోనర్లో ఉండే ఒరిజినల్స్, బ్లాక్ బస్టర్ సినిమాలు, ఎక్స్‌క్లూజివ్‌గా టీవీ కంటే ముందే వచ్చే ప్రీమియర్స్, లైవ్ ఛానెల్స్ అన్నీ ఇప్పుడు జియో సినిమాలో సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 4కే క్వాలిటీలో. ఈ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ కేవలం నెలకు రూ.29 మాత్రమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments