2025 జనవరి 11 నుండి, రిలయన్స్ జియో తన జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్రయోజనాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన వినియోగదారులు 24 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రయోజనాలను పొందుతారు. జియో, యూట్యూబ్ మధ్య ఈ ముఖ్యమైన భాగస్వామ్యం, భారతదేశవ్యాప్తంగా ఉన్న సబ్‌స్క్రైబర్ల కోసం డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది.
యూట్యూబ్ ప్రీమియమ్ ప్రత్యేకతలు:
యూట్యూబ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సబ్‌స్క్రైబర్లు ఈ ప్రత్యేక సదుపాయాలను పొందుతారు:
1. అడ్వర్టైజెంట్ బ్రేక్ లేకుండా వీక్షణ: ఇష్టమైన వీడియోలను అడ్డంకులు లేకుండా చూడండి.
2. ఆఫ్లైన్ వీడియోలు: ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎప్పుడైనా ఆస్వాదించడానికి కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
3. బ్యాక్‌గ్రౌండ్ ప్లే: ఇతర యాప్స్ ఉపయోగిస్తూనే లేదా స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ వీడియోలు చూడండి లేదా సంగీతం వినండి.
4. యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియమ్: 100 మిలియన్ల కంటే ఎక్కువ పాటల అడ్-ఫ్రీ లైబ్రరీ, వ్యక్తిగత ప్లేలిస్ట్‌లు, మరియు గ్లోబల్ చార్ట్-టాపర్లు.
అర్హత గల ప్లాన్లు:
ఈ ఆఫర్ జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అనుమతించబడిన ప్లాన్లు: ₹888, ₹1199, ₹1499, ₹2499, మరియు ₹3499.
యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి:
1. అర్హత గల ప్లాన్‌కు సభ్యత్వాన్ని పొందండి లేదా స్విచ్ అవ్వండి.
2. మై జియో యాప్‌లో మీ అకౌంట్ లో లాగిన్ అవ్వండి.
3. పేజీలో కనిపించే యూట్యూబ్ ప్రీమియమ్ బ్యానర్‌పై క్లిక్ చేయండి.
4. మీ యూట్యూబ్ ఖాతాతో లాగిన్ అవ్వండి లేదా కొత్త ఖాతాను సృష్టించండి.
5. అదే వివరాలతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ టాప్ బాక్స్‌లో లాగిన్ అవ్వండి, మరియు యాడ్-ఫ్రీ కంటెంట్‌ను ఆస్వాదించండి.