Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలట్లకు జ్వరం - నిలిచిన 14 జెట్ ఎయిర్‌వేస్ విమానాలు

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (14:39 IST)
జెట్ ఎయిర్‌వేస్... దేశంలో ఉన్న ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటి. అసలే ఆర్థిక కష్టాలు.. నష్టాలు.. అప్పులు ఊబి. వీటికితోడు మరో కష్టం వచ్చిపడింది. ఈ సంస్థలో పనిచేసే పైలెట్లందరికీ ఒకేసారి జ్వరం (అనారోగ్యం) వచ్చిందట. దీంతో వారంతా సిక్ లీవ్ పెట్టారు. ఫలితంగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా 14 విమాలను జెట్ ఎయిర్‌వేస్ రద్దు చేసింది. 
 
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగి, నష్టాల నుంచి తేరుకునే మార్గం కోసం వెతుక్కుంటున్న జెట్ ఎయిర్‌వేస్.. సెప్టెంబర్ నెలలో సగం వేతనం చెల్లించింది. మిగిలిన వేతనంతో పాటు అక్టోబరు, నవంబరు నెలల వేతనాన్ని పెండింగులో పెట్టింది. దీంతో పైలెట్స్‌లో చాలామంది మూకుమ్మడిగా సెలవులు పెట్టేశారు. జ్వరంతో బాధపడుతున్నామని విధులకు హాజరుకాలేమని సెలవు సందేశం పంపించారు. దీంతో జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు దిమ్మ తిరిగిపోయింది. 
 
పలువురు పైలెట్లు తమకు అనారోగ్యంగా ఉందని చెబుతూ మూకుమ్మడిగా సిక్ లీవు పెట్టడంతో 14 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఆ విమానాల సర్వీసుల్లో ప్రయాణించాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా జెట్ ఎయిర్‌వేస్ అధికారులతో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు. పైలట్లు సహకరించని కారణంగానే విమానాలను రద్దు చేశామని, దీని కారణంగా దాదాపు 100కు పైగా సర్వీసులు నిలిచిపోయాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments