Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్‌ను వెనక్కి నెట్టిన జపాన్.. పాస్‌పోర్టు నాణ్యతలో అగ్రస్థానం..

ప్రపంచంలోనే కఠిన నిబంధనలతో కూడిన పాస్‌పోర్ట్‌గా జపాన్ దేశపు పాస్‌పోర్టు ఎంపికైంది.

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (17:47 IST)
ప్రపంచంలోనే కఠిన నిబంధనలతో కూడిన పాస్‌పోర్ట్‌గా జపాన్ దేశపు పాస్‌పోర్టు ఎంపికైంది. ఈ మేరకు అత్యంత కఠినతరమైన నిబంధనలతో కూడిన పాస్‌పోర్టులను కలిగిన దేశంగా జపాన్ అగ్రస్థానంలో నిలిచి.. సింగపూర్‌ను వెనక్కి తగ్గింది. హెన్లీ అనే వ్యవస్థ అంతర్జాతీయ విమాన రాకపోకల సంఘంతో సంయుక్తంగా పాస్‌పోర్ట్ ర్యాంక్ అనే పేరిట ప్రపంచ దేశాల పాస్‌పోర్టుల నాణ్యతతో కూడిన జాబితాను విడుదల చేసింది. 
 
దీనిప్రకారం 2018 సంవత్సరానికి గాను.. అత్యంత పటిష్టమైన, కఠినమైన పాస్‌పోర్ట్‌లను కలిగిన వున్న దేశాల జాబితాలో జపాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జపాన్ పాస్‌పోర్ట్ కలిగివున్న వారు.. 190 దేశాలకు వెళ్ళాలనుకుంటే.. వీసా లేకుండా.. ఇంకా ఇతర దేశాలకు బయల్దేరే ముందు వీసాలను పొందవచ్చు. అంతకుముందు సింగపూర్ పాస్‌పోర్ట్ పటిష్టమైన, కఠినమైన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
 
అయితే ఈ ఏడాది ప్రారంభంలో మియాన్మార్‌కు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చునని సింగపూర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, జపాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో జర్మనీ, దక్షిణకొరియా, ఫ్రాన్స్ దేశాలు పంచుకుంటున్నాయి. ఇంగ్లండ్, అమెరికా నాలుగైదు స్థానాల్లో వున్నాయి. 
 
ఇక భారత్ విషయానికి వస్తే.. పాస్‌పోర్ట్ ర్యాంక్ జాబితాలో 81వ స్థానానికి పరిమితమైంది. భారత పాస్‌పోర్ట్ కలిగివున్నవారు 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు. అలాకాకుండా బయల్దేరేందుకు ముందు వీసా పొందవచ్చు. ఇక చైనాకు ఈ జాబితాలో 71వ స్థానం లభించింది. రష్యాకు 47వ స్థానం లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments