Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం తాయిలం : జన్‌‌ధన్‌ ఖాతాల్లో రూ.10 వేలు జమ... రూపాయి కూడా లేని ఖాతాల్లో...

జన్‌ధన్ ఖాతాల్లో 10 వేల రూపాయల చొప్పున జమ చేయాలని కేంద్రం భావిస్తోంది. అదీ కూడా... ఒక్క రూపాయి కూడా లేని (నిల్ బ్యాలెన్స్) ఖాతాల్లోనే ఈ మొత్తాన్ని జమ చేయాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (10:28 IST)
జన్‌ధన్ ఖాతాల్లో 10 వేల రూపాయల చొప్పున జమ చేయాలని కేంద్రం భావిస్తోంది. అదీ కూడా... ఒక్క రూపాయి కూడా లేని (నిల్ బ్యాలెన్స్) ఖాతాల్లోనే ఈ మొత్తాన్ని జమ చేయాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం దేశంలో రూ.500, రూ.1000 నోట్ల విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేసిన విషయంతెల్సిందే. ఈ నోట్ల రద్దు వల్ల రూ.3 లక్షల కోట్ల మేరకు రావొచ్చిని కేంద్రం భావిస్తోంది. ఈ సొమ్ములో కొంత మొత్తాన్న పేదల ఖాతాల్లో జమ చేయాన్న ఉద్దేశ్యంతో కేంద్రం ఉంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న ఉద్దేశ్యంతో నిల్ బ్యాలెన్స్‌తో జన్‌ధన్ ఖాతాలను ప్రారభించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ ఖాతాలు దేశ వ్యాప్తంగా 25 కోట్లు ఉన్నాయి. వీటిలో రూపాయి కూడా లేనివి ఖాతాలు 5.8 కోట్లు ఉన్నట్టు గుర్తిచారు. ఇలాంటి ఖాతాల్లో ఒక్కో ఖాతాలో రూ.10 వేలు చొప్పున 58 వేల కోట్లు జమ చేయాలని భావిస్తోంది. 
 
ఇదే జరిగితే... నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి.. అదే సమయంలో, చేతిలో డబ్బు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజానీకానికీ ఇద్దరికీ మేలు చేసే చర్య అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘ఆ నిర్ణయం వల్ల కలిగే లాభాలను పేద రైతులు, ఇతర పేదలకు పంపిణీ చేయబోతున్నామనే సంకేతాలను ప్రభుత్వం ఈ చర్య వల్ల ఇవ్వగలుగుతుంది’’ అని వారు విశ్లేషిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments