Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ రిటర్ను దాఖలు గడువును పెంచిన ఐటీ శాఖ

Webdunia
శనివారం, 4 జులై 2020 (17:48 IST)
ఆదాయ పన్ను దాఖలు చేసే వారికి ఆదాయపన్ను శాఖ మరో వెసులుబాటు కల్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖల చేసేందుకు గడువును మరింతగా పొడగించింది. ఈ తాజా పొడగింపు మేరకు ఐటీ రిటర్నును వచ్చే నవంబరు 30వ తేదీ వరకు దాఖలు చేయవచ్చని పేర్కొంది. 
 
కరోనా సంక్షోభ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. మరోవైపు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రివైజ్డ్ ఐటీ రిటర్నులను ఫైల్ చేసే సమయాన్ని ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 
 
పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసే గడువును కూడా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన విషయం తెల్సిందే. వాస్తానికి ఇది గత నెలాఖరుతో ముగిసింది. కానీ, కరోనా వైరస్ కారణంగా దీన్ని పొడగించింది. 
 
అలాగే, పన్ను ఆడిట్ రిపోర్ట్ నివేదిక గడువును అక్టోబరు 31వ తేదీ వరకు పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను టీడీఎస్/టీసీఎస్ సర్టిఫికెట్ల జారీని ఆగస్టు 15 వరకు పొడిగించినట్టు ఐటీ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments