Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినా... భారత ఆర్థిక వ్యవస్థకు ఢోకాలేదు.. మహాస్ట్రాంగ్

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. పీవోకేలో భారత్ చేసిన దాడులకు పాకిస్థాన్ ఏ క్షణమైనా దాడులు జరపవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఇరు దేశాల ఆర్థిక వ్

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (16:15 IST)
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. పీవోకేలో భారత్ చేసిన దాడులకు పాకిస్థాన్ ఏ క్షణమైనా దాడులు జరపవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలపై నిపుణులేమంటున్నారనే అంశాన్ని పరిశీలిస్తే... 
 
ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌తో ఆర్థిక సంబంధాలు తెంచుకున్నా భారత ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పెద్దగా ఉండదని స్పష్టం చేస్తున్నారు. 2015-16లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 261 కోట్ల డాలర్లకు చేరినా, భారత విదేశీ వాణిజ్యంలో అది కేవలం 0.4 శాతానికి మాత్రమే. దీంతో పాక్‌తో వాణిజ్య బంధం తెగిపోయినా మన ఆర్థిక వ్యవస్థకు పెద్దగా వచ్చే నష్టమేం లేదని చెబుతున్నారు. 
 
అయితే, విమాన రవాణా వ్యవస్థపై మాత్రం తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకరి గగన తలంలో మరో దేశ విమానాలు ఎగరకుండా నిషేధం విధించాలనే వాదన మళ్లీ తెరపైకి వచ్చింది. 2002లో కూడా రెండు దేశాలు ఇలాంటి ఆంక్షలు విధించుకున్నాయి. ఇపుడు మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే గల్ఫ్‌, అమెరికా, యూరోపియన్‌ దేశాలకు వెళ్లే భారత పౌర విమానాలన్నీ పాక్‌ గగనతలాన్ని తప్పించి అరేబియా సముద్రం మీదగా వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రయాణ సమయం 60 నిమిషాలు పెరగడంతో పాటు ఇంధన ఖర్చులూ పెరుగుతాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments