Webdunia - Bharat's app for daily news and videos

Install App

"'బడే దిల్‌వాలి దీపావళి'" ప్రచారాన్ని ప్రారంభించిన ఇనార్బిట్ మాల్

ఐవీఆర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (00:17 IST)
రిటైల్ మరియు షాపింగ్ సెంటర్ విభాగంలో అగ్రగామిగా ఉన్న ఇనార్బిట్ మాల్స్ దీపావళి పండుగ పురస్కరించుకొని 'బడే దిల్‌వాలి దీపావళి' పేరిట ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం సాంప్రదాయ హద్దులు దాటి, ఈ దీపావళికి అందరూ ఒకే కుటుంబంగా కలిసి రావాలని ఆహ్వానిస్తుంది. ఈ ప్రచారం ద్వారా, ఇనార్బిట్ మాల్స్ ఒక చిరస్మరణీయ అనుభవానికి వేదికను ఏర్పాటు చేసింది, ఇది ప్రతి ఒక్కరూ దాతృత్వాన్ని, దయను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. డిజిటల్ మరియు ప్రింట్‌ మధ్యమాల ద్వారా చేసే, ఈ ప్రచారం కుటుంబం మరియు స్నేహితుల ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా, సేవా సిబ్బంది నుండి సహోద్యోగులు, పొరుగువారు సహా మన రోజువారీ జీవితాలకు సహకరించే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతనిస్తుంది. జీవితాల్లో వెలుగులు నింపే ఈ పండుగను, హృదయపూర్వకంగా జరుపుకోవాలని ఆహ్వానిస్తుంది. 
 
ఆకర్షనీయమైన దృశ్యాలతో పాటు, ఇనార్బిట్ తమ మాల్స్‌లో అనేక ఇతర ఈవెంట్‌లు మరియు వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తోంది, సందర్శకులకు సంపూర్ణమైన మరియు లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రచారం మాల్‌ను కేవలం షాపింగ్ గమ్యస్థానంగా మాత్రమే కాకుండా కమ్యూనిటీ ఒకచోట చేరి, వేడుక జరుపుకోవడానికి ఒక ప్రదేశంగా మార్చాలనే ఇనార్బిట్ యొక్క సిద్దాంతం ను ప్రతిబింబిస్తుంది.
 
ప్రచార ప్రారంభం సందర్భంగా, రోహిత్ గోపాలని, ఎస్ విపి & హెడ్ లీజింగ్, మార్కెటింగ్ & కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఇనార్బిట్ మాల్స్ (ఇండియా) ప్రై.  లిమిటెడ్ మాట్లాడుతూ, "ఇనార్బిట్ మాల్స్‌లో, దీపావళి కేవలం దీపాల పండుగ మాత్రమే కాదని, ఇది ఐక్యత యొక్క వేడుక అని  మేము విశ్వసిస్తున్నాము; ఈ సంవత్సరం, మా 'బడే దిల్‌వాలి దీపావళి' ప్రచారం ద్వారా, దీపావళి ఆనందాన్ని పంచుకోవడానికి మా అభిమానులను ప్రేరేపించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు. 
 
నాష్ఎక్స్‌పి మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కేవల్రమణి మాట్లాడుతూ, "ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా ఇనార్బిట్‌తో కలిసి పనిచేయడం ఒక ఏజెన్సీగా మేము గర్విస్తున్నాము. మాల్స్‌లో అనుభవపూర్వకమైన యాక్టివేషన్‌లతో సహా నిజమైన, అర్ధవంతమైన అనుభవాల ద్వారా, దీపావళి అంటే ఏమిటో ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము " అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్టోబర్ 25న రాబోతోన్న "నరుడి బ్రతుకు నటన".. సక్సెస్ చెయ్యండి ప్లీజ్

"లవ్ రెడ్డి" స్వచ్ఛమైన ప్రేమకథ.. ఎంతటి రాతి గుండెనైనా కరిగించే క్లైమాక్స్

జై హనుమాన్ కోసం హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి

కుటుంబ సమేతంగా చూడదగ్గ వెబ్ సిరీస్.. ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’

కంగువ కోసం ప్రభాస్ - రజనీకాంత్ ఒక్కటవుతారా? అదే కనుక జరిగితే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు సానుకూల దృక్పథం చాలా అవసరం.. ఏం చేయాలి?

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

గుండెలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చేయాల్సినవి ఏమిటి?

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

తర్వాతి కథనం
Show comments