Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ ఫ్లాట్ ఇండిగో సేల్ : రూ.877కే విమాన టిక్కెట్

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (10:52 IST)
దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. చౌక ధరకే విమాన టికెట్లు అందిస్తూ వచ్చిన ఈ సంస్థ తాజాగా రూ.877కే విమాన టిక్కెట్‌ను ప్రకటించింది. బిగ్ ఫ్లాట్ ఇండిగో సేల్ పేరుతో ఈ ఆఫర్ తీసుకువచ్చింది. ఈ సేల్‌లో భాగంగా విమాన ప్రయాణికులు రూ.877కే విమాన టికెట్ పొందొచ్చు. 
 
ఇండిగో రూ.877 టికెట్ ఆఫర్ జనవరి 13 నుంచి అందుబాటులోకి వచ్చింది. జనవరి 17 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. టికెట్ ఆఫర్‌లో భాగంగా విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా జర్నీ చేయొచ్చు. 
 
ఇండిగో నడుపుతోన్న నాన్ స్టాప్ ఫ్లైట్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఎంపిక చేసిన రూట్లలో తిరిగే విమానాలకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గమనించాలి. అయితే ఆఫర్‌లో భాగంగా ఎన్ని సీట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయో కంపెనీ తెలియజేయలేదు.
 
అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే ఆఫర్ కింద సీట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇకపోతే ఇండస్ ఇండ్ బ్యాంక్ కస్టమర్లు టికెట్లు బుక్ చేసుకుంటే 12 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. గరిష్టంగా రూ.5 వేలకు తగ్గింపు పొందే ఛాన్స్ ఉంది. హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు కలిగిన వారికి 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments