పండుగలకు ఊరెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. నవంబర్ 30 వరకే ఆ సేవలు..

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (11:07 IST)
దసరా, దీపావళి పండుగలకు ఊరెళ్లాలనుకునేవారికి శుభవార్త. భారతీయ రైల్వే మరో 392 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 196 రూట్లలో ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా మార్చి 25 నుంచి భారతీయ రైల్వే సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 1 నుంచి దశల వారీగా రైళ్లను ప్రకటిస్తోంది రైల్వే. ఇటీవల 39 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ రైళ్లు అక్టోబర్ 13 నుంచి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. 
 
ఇక రాబోయేది పండుగ సీజన్ కావడంతో మరో 392 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది భారతీయ రైల్వే. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా 196 జతల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 మధ్య ఈ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి 
 
కొత్తగా ప్రకటించిన 392 రైళ్లు ఏ రూట్లలో నడుస్తాయో జాబితా కూడా విడుదల చేసింది భారతీయ రైల్వే. అయితే టైమింగ్స్ వివరాలను ఆయా జోన్లు వెల్లడిస్తాయి. అయితే రెగ్యులర్ రైళ్ల టైమింగ్స్ ఈ ప్రత్యేక రైళ్లకు వర్తిస్తాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. 
 
ఈ 392 స్పెషల్ ట్రైన్స్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లు ఉన్నాయి. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఇవి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ మాత్రమే. నవంబర్ 30 వరకే సేవలు అందిస్తాయి. పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments