మందుబాబులకు షాకింగ్ వార్త. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు మద్యం వ్యాపారులు.
ఇందులో భాగంగా మే ఆరో తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ మేరకు డివిజన్ స్థాయిలో మద్యం కొనుగోళ్లను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయంపై ఈ సమ్మె జరుగుతుంది.
ఇందులో భాగంగా లిక్కర్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. మే 19 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర పోరాటాలు సాగిస్తామని లిక్కర్ డీలర్లు అంటున్నారు.