Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్‌లో నగదు వినియోగిస్తే ఫైన్ : నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్

డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహక చర్యల్లో భాగంగా భవిష్యత్‌లో నగదును ఉపయోగించే వారి నుంచి అపరాధం వసూలు చేసే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సూచన ప్రాయంగా వెల్లడించారు. అంతేకాకుండా, దేశంలో పెద్ద

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (09:07 IST)
డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహక చర్యల్లో భాగంగా భవిష్యత్‌లో నగదును ఉపయోగించే వారి నుంచి అపరాధం వసూలు చేసే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సూచన ప్రాయంగా వెల్లడించారు. అంతేకాకుండా, దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు జనవరి నెల వరకు ఉంటాయన్నారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఏర్పడేందుకు వీలుగా ప్రజలందరూ డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు గల అన్ని అవకాశాలను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అమితాబ్‌ కాంత్‌ నేతృత్వం వహిస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో దాదాపు 80 శాతం లావాదేవీలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో జరిపేందుకు ఉన్న అవకాశాలను కమిటీ పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏర్పడిన నగదు కష్టాలు జనవరి నెల మధ్యవరకు ఉంటాయని తెలిపారు. కాగా, 7.5 శాతం వృద్ధి సాధించాలంటే డిజిటైజేషన్ ప్రధానమైనదని ఉద్ఘాటించారు. 
 
మరోవైపు.. త్వరలో మహాత్మాగాంధీ సీరిస్‌లో భాగంగా రూ.500 నోట్లను విడుదల చేస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోటు రెండు నెంబర్‌ ప్యానళ్లపై 'ఈ' ఇంగ్లీషు అక్షరం ఉంటుందని, నోటు రెండో వైపు స్వచ్ఛ భారత్‌ చిహ్నం ముద్రిస్తారని తెలిపింది. కొన్ని బ్యాంకు నోట్లకు అదనంగా నంబర్‌ ప్యానళ్లలో (స్టార్‌) గుర్తు ఉంటుందని తెలిపింది. స్టార్‌ గుర్తుతో రూ.500 నోటు మొదటి సారి జారీ చేస్తున్నామని, స్టార్‌ గుర్తుతో ఉన్న రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు ఇప్పటికే చెలామణీలో ఉన్నాయని పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments