Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఆర్థిక మాంద్యం తప్పదా... రఘురాం రాజన్ ఏమంటున్నారు?

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (09:35 IST)
భారత్‌లో ఆర్థిక మాంద్యంపై భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. దేశ ఆర్థికాభివృద్ధి ప్రస్తుతం ఆరు శాతంగా ఉందని, మున్ముందు కూడా ఇదే కొనసాగితే భారత్ మధ్యాదాయ దేశంగా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
హైదరాబాద్‌‍లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ ఆర్థికాభివృద్ధి ప్రస్తుతం ఆరు శాతంగా పరిమితమైతే 2047లో కూడా భారత్ మధ్యాదాయ దేశంగా మిగిలిపోతుందన్నారు. అప్పటికి జనాభాలో వృద్ధుల శాతం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందన్నారు. 
 
'ఆర్థికాభివృద్ధి ఏటా 6 శాతంగా ఉందనుకుందాం. అది ప్రతి 12 ఏళ్లకూ రెట్టింపు అవుతుందనుకుంటే 24 ఏళ్లల్లో తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుంది. అంటే.. ఇప్పుడున్న 2,500 డాలర్ల తలసరి ఆదాయం 10 వేల డాలర్లకు పెరుగుతుంది. దీంతో, 2047కి కూడా మనం మధ్యాదాయ దేశంగానే మిగిలిపోతాం' అని ఆయన పేర్కొన్నారు.
 
2047 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతుందని రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గిందని వెల్లడించారు. వేగంగా అభివృద్ధి సాధించకపోతే భారత్ సుసంపన్నం అయ్యే లోపే వృద్ధాప్యం మీద పడుతుందని, జనాభాలో పెరిగిన వృద్ధుల భారం ఆర్థికవ్యవస్థపై పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థికవృద్ధి రేటు ఉద్యోగాల కల్పనకు సరిపోదన్నారు. వృద్ధుల జనాభా పెరిగే లోపే భారత్ ను సంపన్న దేశంగా మార్చేందుకు ప్రస్తుత వృద్ధిరేటు సరిపోదని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments