యూపీఏ - ఎన్డీయేలు ఫుట్‌బాల్‌లా ఆడుకున్నాయి : విజయ్ మాల్యా

లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలపై ఘాటైన విమర్శలు చేశారు. ఈ రెండు కూటముల ప్రభుత్వాలు తనను ఫుట్‌బాల్‌లా ఆడుకున్నాయని, ఆడుకుంటున్నాయని ఆరోపించారు.

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (15:10 IST)
లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలపై ఘాటైన విమర్శలు చేశారు. ఈ రెండు కూటముల ప్రభుత్వాలు తనను ఫుట్‌బాల్‌లా ఆడుకున్నాయని, ఆడుకుంటున్నాయని ఆరోపించారు. దేశంలోని పలు బ్యాంకుల నుంచి రూ.కోట్లు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నారు.  
 
అక్కడ నుంచి సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తనను తాను ఫుట్‌బాల్‌తో పోల్చుకున్నారు. రెండు పోటా పోటీ జట్లు యూపీఏ, ఎన్డీయే తనను ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారని, దురదృష్టవశాత్తు రిఫరీస్‌ లేరంటా తాజాగా ట్వీట్ చేశారు. 
 
రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోకుండా కఠినమైన నిబంధనలతో చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో మాల్యా స్పందించారు. మీడియాను తనకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మాల్యా కేసులపై జరుగుతున్న సీబీఐ విచారణను, లండన్‌ నుంచి మాల్యాను వెనక్కి రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలను మాల్యా విమర్శించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments