UPIని వినియోగించడంలో హైదరాబాద్ 32 శాతం వృద్ధితో డిజిటల్ చెల్లింపుల్లో శక్తివంతమైన పెరుగుదల నమోదు

ఐవీఆర్
గురువారం, 4 డిశెంబరు 2025 (19:33 IST)
హైదరాబాద్: తమ రోజూవారీ లావాదేవీల్లో వినియోగదారులు UPI, క్యాష్‌లెస్ విధానాలను వినియోగించడం పెరుగుతున్న కారణంగా అత్యధిక-వృద్ధి గల డిజిటల్ చెల్లింపుల మార్కెట్ గా తెలంగాణా అభివృద్ధి చెందుతోందని 120 నగరాల్లో 6,000 మంది కస్టమర్లపై చేసిన ఒక సర్వే ఆధారంగా హౌ అర్బన్ ఇండియా పేస్ 2025 నివేదిక నుండి సేకరించిన అంశాలు తెలియచేస్తున్నాయి. ప్రధానమైన మెట్రోపాలిటన్ ప్రాంతాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ డిజిటల్ చెల్లింపులను ఉపయోగించే ధోరణులను ఈ సర్వే వెల్లడించింది.

దక్షిణ భారతదేశంలో పెద్ద మరియు మధ్యస్థ పరిమాణం గల నగరాలు శక్తివంతమైన UPI వాడకాన్ని చూపించాయని నివేదిక తెలియచేసింది. ఆఫ్‌లైన్ లావాదేవీల్లో 35 శాతం, ఆన్లైన్ కొనుగోళ్లల్లో 52 శాతం UPIచే ప్రోత్సహించబడ్డాయి. హైదరాబాద్ లోని కస్టమర్లు అవసరమైన, వివేచన గల వ్యయం కోసం వాలెట్స్, క్రెడిట్ కార్డ్స్ వంటి కొత్త డిజిటల్ ఫార్మాట్స్‌ను విశ్వశిస్తున్నారు. వేగవంతమైన, నిరంతరమైన, సురక్షితమైన చెల్లింపు అనుభవాలను ఇవి చూపిస్తున్నాయి.
 
హైదరాబాద్ వంటి పెద్ద నగరాలు ప్రధానమైన మెట్రోలతో వేగంగా ఈ అంతరాన్ని తగ్గిస్తున్నాయి. ప్రధానమైన ఆరు మెట్రోలలో, ఆన్లైన్ కోసం 89% మరియు ఆఫ్ లైన్ కొనుగోళ్ల కోసం 62% డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్, మధ్యస్థ పరిమాణం గల నగరాలు ఇప్పటికే 56% ఆఫ్ లైన్ డిజిటల్ చెల్లింపులు అనుసరిస్తున్నాయి, ఇది ఈ మార్కెట్లు ఎంత వేగంగా డిజిటల్ చెల్లింపులను అనుసరిస్తున్నాయో సూచిస్తోంది. పెరుగుతున్న నమ్మకం, UPI మరియు వాలెట్ వాడకంలో నిరంతర వృద్ధితో, క్యాష్ లెస్ వాణిజ్యం దిశగా తెలంగాణ పరివర్తనం చెందడం అనేది హైదరాబాద్‌ను భారతదేశంలోనే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఒక ముఖ్యమైన వేదికగా నెలకొల్పుతుంది.
 
హైదరాబాద్ దక్షిణ భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తనలో ముందరి స్థానంలో ఉంది. UPIని వినియోగించడంలో సంవత్సరానికి 33% పెరుగుదల కస్టమర్ నమ్మకాన్ని లోతుగా ప్రదర్శిస్తోంది, అని వికాస్ బన్సల్, CEO, అమేజాన్ పే ఇండియా అన్నారు. గృహావసరాల నుండి అత్యధిక విలువ కలిగిన కొనుగోళ్ల వరకు, డిజిటల్ చెల్లింపులు డీఫాల్ట్ ఎంపికగా మారాయి. ఈ పెరుగుదల నిజాయితీ, వేగాన్ని విలువైనదిగా భావించే కస్టమర్లను ఈ వృద్ధి ప్రతిబింబిస్తుంది. వ్యాపారులు డిజిటల్ ఆమోదాన్ని వేగంగా స్వీకరించడం ద్వారా మద్దతు లభిస్తుంది. భారతదేశంలో అత్యంతగా డిజిటల్ ఆత్మవిశ్వాసం కలిగిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా హైదరాబాద్ తన స్థానాన్ని శక్తివంతం చేసిన కారణంగా, తెలంగాణలో వినియోగదారులు, వ్యాపారులు ఇరువురికి ఉపయోగపడే నమ్మకమైన చెల్లంపు పరిష్కారాలను కేటాయించడానికి మేము కట్టుబడ్డాము.
 
అమేజాన్ పే ఈ విస్తృతమైన మార్పును చూపిస్తోంది, కియర్ని సర్వే ప్రకారం, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు సహా టియర్ 2, టియర్ నగరాలు ప్రాథమికమైన వృద్ధి ఇంజన్లుగా అభివృద్ధి చెందాయి, అమేజాన్ పే యొక్క డిజిటల్ ఖర్చుల్లో 70 శాతానికి పైగా తోడ్పడుతున్నాయి, ఇది మెట్రోలకు బయట కూడా చొచ్చుకొని వెళ్తోందని సంకేతాన్ని సూచిస్తోంది. కిరాణా, మందులు, యుటిలిటీస్ మరియు కుటుంబ అవసరాలు వంటి రోజూవారీ వాడకం సందర్భాలను ఇప్పుడు UPI, వాలెట్స్ ద్వారా చెల్లించే డిజిటల్ చెల్లింపులు ఆధిపత్యం వహిస్తాయి.
 
ఈ వేగం వ్యాపారుల వ్యవస్థకు కూడా విస్తరించింది. టియర్ 2, స్థానిక విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్లు, పొరుగున ఉన్న స్టోర్స్ ఉపయోగించడం పెరిగిన కారణంగా టియర్ 3 నగరాల నుండి అమేజాన్ పే ద్వారా ప్రాసెస్ చేయబడే ఆఫ్ లైన్ మర్చంట్ చెల్లింపులు పెరిగాయి. శక్తివంతమైన వ్యాపారులు  ప్రవేశించడం, పెరుగుతున్న పునరావృత వినియోగం ద్వారా మద్దతు పొంది హైదరాబాద్ ఈ మార్పులో ముందంజ వేసింది. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న టియర్-3 మార్కెట్లు అయిన మెదక్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ వంటి అత్యదిక వృద్ధి సమూహాల్లో వ్యాపారులను చెల్లింపు ప్లాట్ ఫాంలోకి నమోదు చేయడం ద్వారా తెలంగాణలో తన ఉనికిని విస్తరిస్తోంది.
 
హైదరాబాద్ లోని అమేజాన్ పే యొక్క సామర్థ్యం ఈ వేగాన్ని మరింత ప్రతిబింబిస్తోంది, నగరం మొత్తం లావాదేవీల్లో 15% YoY వృద్ధిని నమోదు చేసింది, ఇది UPIని వినియోగించడంలో శక్తివంతమైన 30%కి పైగా ప్రోత్సహించబడింది. అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా నగరం లావాదేవీల్లో సుమారు 20% YoYని మరియు అమేజాన్ పే లేటర్ వాడకంలో 10% వృద్ధిని నమోదు చేసింది. ఇది సరళమైన, బహుమానపూర్వకమైన చెల్లింపు ఫార్మాట్స్‌ను విస్తృతంగా వినియోగించడాన్ని సూచిస్తోంది. ఇది తెలంగాణా అంతటా పండగ ధోరణులతో అనుసంధానం చెందింది. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సమయంలో నగరంలో 4 కస్టమర్లలో 1 అమేజాన్ పేని ఉపయోగించారు. ఈ సరళమైన, రివార్డ్స్ నాయకత్వంలోని చెల్లింపు ఫార్మాట్స్ అనుసరణ విశ్వశనీయమైన డిజిటల్ చెల్లింపుల ఎంపికలతో పెరుగుతున్న సౌకర్యాన్ని తెలియచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments