Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 4న చెన్నైలో హోండా రెవ్‌ఫెస్ట్..

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (18:15 IST)
ద్విచక్రవాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న హోండా కంపెనీ ఆగస్టు 4వ తేదీన చెన్నైలో రెవ్‌ఫెస్ట్‌ 2015ను నిర్వహించనుంది. ఎనిమిది నగరాల్లో చేపట్టిన దశలవారీ నిర్వహణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులోభాగంగా న్యూఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఇండోర్, అహ్మదాబాద్‌ నగరాలను ఎంపిక చేసింది. ఇదే అంశంపై హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కైతా మురమత్సు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం తొలి ఏడు మాసాల్లో టూ వీలర్ సెగ్మెంట్‌లో ఆటోమేటిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేయడం జరిగిందన్నారు. ఇపుడు కొత్త తరహా, ఫన్ మోటార్ సైకిల్స్‌ను తీసుకొచ్చే అంశంపై హోండా దృష్టిసారించినట్టు తెలిపారు. రెవ్‌ఫెస్ట్ వేదికగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సీబీఆర్ 650ఎఫ్ మోడల్‌తో పాటు.. అనేక రకాలైన మోడల్స్‌ను ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే చెన్నైలోని ఎస్.వి.ఎం హోడాలో సీబీఆర్ 650ఎఫ్ ద్విచక్రవాహనాల కోసం బుకింగ్స్ ప్రారంభమైనట్టు తెలిపారు.
 
 
అనంతరం ఆ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. చరిత్రను తిరగరాయడంలో హోండాకు సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ఇపుడు భారత్‌లో మరో చరిత్ర సృష్టించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రెవ్‌ఫెస్ట్ యువతకు అతిపెద్ద స్టార్టింగ్ పాయింట్‌గా ఉంటుందన్నారు. 4వ తేదీన జరిగే రెవ్‌ఫెస్ట్ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, నటి తాప్సీ‌లతో పాటు.. టాప్ 17 నటీనటుల ర్యాంప్ షో ఉంటుందని తెలిపారు. ఈ ఫెస్ట్ కోసం ఇప్పటికే 15 వేల మంది యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు చెప్పారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments