Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘థాట్‌ఫుల్‌ ఈజ్‌ బ్యూటీ ఫుల్‌’ను ప్రారంభించిన హింద్‌వేర్‌

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (22:34 IST)
సుప్రసిద్ధ బాత్‌వేర్‌ బ్రాండ్‌ హింద్‌వేర్‌, నూతన సంవత్సరాన్ని తమ సరికొత్త ప్రచారం ‘థాట్‌ఫుల్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ (ఆలోచనతోనే అందం)తో ఆరంభించింది. ఈ నూతన ప్రచారం ఈ విభాగంలో మొట్టమొదటిది మరియు సృజనాత్మక పనితీరుతో కూడిన ఉత్పత్తి పరిష్కారాలు ఏ విధంగా సౌకర్యాన్ని వినియోగదారులకు అందిస్తాయో వెల్లడిస్తుంది.
 
అందమైన బాత్‌రూమ్‌ల మీదనే దృష్టి సారించి వరుసగా పలు వాణిజ్య ప్రకటనలను తీర్చిదిద్దినప్పటికీ, ‘థాట్‌ఫుల్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రం మాత్రం వాటికి విభిన్నం.  మ్యాజిక్‌ సర్కిల్‌ కమ్యూనికేషన్స్‌ నేపథ్యీకరించిన ఈ చిత్రంలో  ఈ విభాగపు సంప్రదాయాన్ని పునర్నిర్వచించడంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బ్రాండ్‌ యొక్క అంతర్లీన ఆవిష్కరణల బలాన్ని బలోపేతం చేసే సంభాషణలను ప్రారంభించేటప్పుడు అందాన్ని టేబుల్‌ స్టాక్స్‌గా పరిగణించడమూ తెలుపుతుంది.
 
కరణ్‌ శెట్టి దర్శకత్వంలో ఫింగర్‌ప్రింట్‌ ఫిల్మ్స్‌ రూపొందించిన ఈ చిత్రంలో  భర్త యొక్క సోదరి (ఆడపడుచు) తెలియకుండానే బాత్‌రూమ్‌కు సంబంధించి భార్యాభర్తల థాట్‌ఫుట్‌ వర్సెస్‌ బ్యూటీఫుల్‌ చర్చలో భాగం అవుతుంది. అయితే ఈ చర్చలో నిర్ణయమనేది అంత సులభంగా ఏమీ రాదనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఈ జంట యొక్క ఆకర్షణీయమైన మరియు సున్నితమైన పరిహాసం ఈ ఉత్పత్తులు కనిపించే తరువాత చిత్రాలలో కొనసాగుతుంది. అప్పుడు కూడా ఆలోచన వర్సెస్‌ అందం చర్చ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
 
హింద్‌వేర్‌ బ్రాండ్‌ అత్యంత లోతైన పరిశోధనను సంప్రదాయ మరియు నూతన తరపు పరికరాలను వినియోగించి చేయడంతో పాటుగా మార్కెట్‌లో వైట్‌ స్పేస్‌ను మరియు ఈ సృజనాత్మక నూతన స్ధానంలో వినియోగదారుల అవసరాలను తెలుసుకుంది.  ఈ బ్రాండ్‌ స్థిరంగా వినియోగదారుల జీవితాలను సులభతరం చేసే ఉత్పత్తులు మరియు పరిష్కారాలను అందిస్తుంది మరియు ‘థాట్‌ఫుల్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ ప్రచారం అదే తరహా సెంటిమెంట్‌ను ప్రదర్శిస్తుంది. దీనిలో వినియోగదారులకు పనితీరు పరంగా అత్యున్నత ప్రదర్శన కనబరుస్తూనే, ఆలోచనాత్మక ఉత్పత్తులను అందించడానికి బ్రాండ్‌ ప్రయత్నాలనూ ప్రదర్శిస్తుంది.
 
ఈ ప్రచారం గురించి శ్రీ సుధాంషు పోఖ్రియాల్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, బాత్‌ ప్రొడక్ట్స్‌, బ్రిల్లోకా లిమిటెడ్‌ మాట్లాడుతూ  ‘‘నేడు, హింద్‌వేర్‌ ఇప్పుడు మహోన్నతమైన, నమ్మకమైన బ్రాండ్‌గా ఓ సముచిత స్ధానం ఏర్పరుచుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా మారుతున్న సౌందర్యంతో పాటుగా అభివృద్ధి చెందగల ఓ శక్తివంతమైన సామర్థ్యాన్ని సైతం ఇది నిరూపించింది. తమ వినియోగదారులను ఇది అర్థం చేసుకోవడంతో పాటుగా దానికి బదులుగా తమ అభిమానులు హింద్‌వేర్‌ను విశ్వసించేలా భారతదేశంలో అత్యుత్తమ బాత్‌వేర్‌ ఉత్పత్తులను అందిస్తుంది.
 
 వినియోగదారులకు సంబంధించి వృద్ధి చెందుతున్న సమాచారం , బ్రాండ్‌ కార్యకలాపాలు నిర్వహించే తీరులో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ఇది కోవిడ్‌–19 మహమ్మారి ప్రభావం వేళ మరింత వాస్తవంగా మారింది. ఇక్కడ ఇప్పటికే కొనుగోలుకు సంబంధించి మరింత సంక్లిష్టమైన మార్గం మరింత అభివృద్ధి చెందింది. వినియోగదారుల ప్రవర్తన పరంగా దీర్ఘకాలిక మార్పులను ఇది చూపడంతో పాటుగా మనం దానిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మా స్థాన దిశలో వ్యక్తీకరించడంతో పాటుగా మా వ్యాపార నిర్ణయాలకూ మార్గనిర్ధేశం చేస్తుంది’’ అని అన్నారు.
 
శ్రీమతి చారు మల్హోత్రా, వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌, బాత్‌ ప్రొడక్ట్స్‌, బ్రిల్లోకా లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘హింద్‌వేర్‌ ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ కనిపిస్తుంది. పరిశ్రమలో తొలిసారి అనతగ్గ డిజైన్లు మరియు ఆవిష్కరణల పరంగా ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ నూతన ప్రచార లక్ష్యం మా స్థానాన్ని మరింత శక్తివంతం చేసుకోవడం మాత్రమే కాదు, విభాగపు సంభాషణను పునర్నిర్వచించడం, అది కేవలం సౌందర్యం మరియు అందం గురించి మాత్రమే ఉంటుంది. నూతన తరపు వినియోగదారులు కేవలం అందమైన బాత్‌రూమ్‌ పరిష్కారాలను మాత్రమే కోరుకోవడం కాదు, తమ జీవితాలను మరింత సులభతరంగా మార్చుకోవాలనీ కోరుకుంటున్నారు. అదే ఈ బ్రాండ్‌ ఆలోచన ‘థాట్‌ఫుల్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ కు అంకురార్పణ చేసింది..’’ అని అన్నారు.
 
నూతన తరపు వినియోగదారులు మరీ ముఖ్యంగా 25–50 సంవత్సరాల వయసు వారిని లక్ష్యంగా చేసుకున్న ఈ టీవీసీ అత్యంత అందంగా శైలి, నాణ్యత లేదా ఆవిష్కరణలను వెల్లడిస్తుంది. అది హింద్‌వేర్‌ అంతర్జాతీయ ప్రమాణాలను సరిపోలుస్తుంది. ఈ సమగ్రమైన బ్రాండ్‌ క్యాంపెయిన్‌లో బహుభాషా చిత్రాలు ఆంగ్లం, హిందీ, కన్నడ, తెలుగు,మలయాళం భాషలలో ఉండటంతో పాటుగా దేశవ్యాప్తంగా విస్తృతశ్రేణిలో ప్రేక్షకులకు చేరువకానుంది. మరింతగా తమ చేరికను విస్తృతం చేస్తూ , ఈ బ్రాండ్‌ ఇప్పుడు విస్తృతస్థాయి మాధ్యమాలు అయిన రేడియో, ఔట్‌డోర్‌ ప్లాట్‌ఫామ్స్‌, ప్రింట్‌, ఆన్‌లైన్‌ మరియు ఓటీటీ పై ఆధారపడి తమ ప్రచార చేరికను విస్తృతం చేయడంతో పాటుగా మరింత ఉత్సాహాన్ని సృష్టించుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments