నెలలో లావాదేవీలు నాలుగు దాటితే.. తాట తీస్తున్న ప్రయివేట్ బ్యాంకులు

నెలలో నాలుగుకు మించి నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌) చేస్తే మీ తాట తీయడానికి ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంకులు సిద్దమైపోయాయి. బ్యాంకుల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను కుదిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్‌ తదితర ప్రైవేట్‌ బ్యాంకి

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (06:48 IST)
నెలలో నాలుగుకు మించి నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌) చేస్తే మీ తాట తీయడానికి ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంకులు సిద్దమైపోయాయి. బ్యాంకుల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను కుదిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్‌ తదితర ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజాలు బుధవారం నుంచి పరిమితులను అమల్లోకి తెచ్చాయి. నెలలో నాలుగు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌) దాటితే రూ. 150 వడ్డించడం మొదలుపెట్టాయి. పొదుపు, శాలరీ అకౌంట్లకు వీటిని వర్తింపచేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. 
 
దీని ప్రకారం ఒక నెలలో పొదుపు ఖాతాలకు సంబంధించి హోమ్‌ బ్రాంచ్‌లలో నాలుగు నగదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. అవి దాటితే ప్రతి అదనపు లావాదేవీపై రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక థర్డ్‌ పార్టీ నగదు లావాదేవీలకు సంబంధించి రోజుకు రూ. 25,000 పరిమితి ఉంటుంది. బేసిక్‌ నో–ఫ్రిల్స్‌ ఖాతాల్లో గరిష్టంగా నాలుగు విత్‌డ్రాయల్స్‌ ఉచితంగా ఉంటాయి. నగదు డిపాజిట్లకు ఫీజులేమీ వర్తించవు.
 
ఐసీఐసీఐ ఐసీఐసీఐ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. హోమ్‌ బ్రాంచ్‌లో నెలలో తొలి నాలుగు లావాదేవీలు ఉచితం. అవి దాటితే ప్రతి రూ. 1,000కి రూ. 5 చొప్పున.. కనిష్టంగా రూ. 150 చార్జీలు ఉంటాయి. థర్డ్‌ పార్టీ లిమిట్‌ రోజుకు రూ. 50,000గా ఉంటుంది. నాన్‌–హోమ్‌ బ్రాంచ్‌లలో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితం. అటుపైన ప్రతి రూ. 1,000కి రూ. 5 చార్జీ. కనిష్టంగా రూ. 150 చార్జీలు వర్తిస్తాయి. అటు క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లలో కూడా తొలి నగదు డిపాజిట్‌ ఉచితం. ఆ తర్వాత రూ. 1,000కి రూ. 5 చొప్పున చార్జీలు ఉంటాయి.
 
యాక్సిస్‌ బ్యాంక్‌.. విలువపరంగా రూ. 10 లక్షల దాకా తొలి అయిదు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌) ఉచితం. దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 5 లేదా రూ. 150 (ఏది ఎక్కువైతే అది) మేర చార్జీలు వర్తిస్తాయి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments