Gold: పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలో మార్పు లేదు..

సెల్వి
శుక్రవారం, 3 ఏప్రియల్ 2026 (14:37 IST)
బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ మార్కెట్‌లో పెరిగిన డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా ఎగబడ్డాయి. 
 
తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం గురువారంతో పోలిస్తే ఏకంగా రూ.1,960కి పెరిగింది. దీంతో ప్రస్తుతం ధర రూ.1,50,930 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల బంగారం తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 పెరిగింది. 
 
ప్రస్తుత మార్కెట్‌లో ఇది రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర నిన్నటి స్థాయిలోనే రూ.2,55,00 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 
 
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటం బంగారం మదుపుదారుల వైపు మొగ్గుచూపుతుండటంతో ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

Nani: ఇట్లు అర్జున లో హాయ్ రే సాంగ్ మెస్మరైజింగ్ చేస్తుంది: నాని

తర్వాతి కథనం
Show comments