Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం ప్రియులకు షాక్.. బంగారంపై రూ.200 వరకు పెంపు

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (09:53 IST)
బంగారం ప్రియులకు షాక్ తగిలింది. కొన్ని రోజులుగా తగ్గుతు వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ధరలు తగ్గుముఖం కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. 
 
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,100కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 పెరిగి రూ. 48,100కు చేరింది. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.73,400కి చేరింది.
 
అయితే తాజాగా ఆదివారం దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.200 వరకు పెరిగింది. హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రధాన నగరాల్లో రూ.100 మాత్రమే పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490 ఉంది. 
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 వద్ద ఉంది. 
 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments