Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి వద్ద తమ నూతన కార్యాలయం ప్రారంభించిన జీస్క్వేర్‌

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (22:55 IST)
దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ప్లాట్‌ ప్రమోటర్‌ జీస్క్వేర్‌ హౌసింగ్‌ లిమిటెడ్‌ తమ నూతన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. గచ్చిబౌలి వద్ద నున్న ఈ నూతన కార్యాలయంలో 200 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేందుకు తగిన వసతులు ఉన్నాయి. ఇప్పటివరకూ 75 మంది ఉద్యోగులు ఇక్కడ సంస్ధకు ఉన్నారు. రాబోయే నెలల్లో మరింత మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోనున్నారు.
 
తెలంగాణాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను జీస్క్వేర్‌ చేపట్టింది.  హైదరాబాద్‌లో సంస్ధ రాబోతున్న ప్రాజెక్టులలో ఒకటి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాగార్జునసాగర్‌ రోడ్‌లోని బీఎన్‌ రెడ్డి నగర్‌ వద్ద ఉంది. అలాగే త్వరలో ప్రారంభంకానున్న మైక్రోసాఫ్ట్‌ డాటా సెంటర్‌కు సమీపంలో షాద్‌ నగర్‌ వద్ద కూడా ఓ ప్రాజెక్ట్‌ ఉంది.
 
ఈ నూతన కార్యాలయం ప్రారంభం చేయడంపై జీస్క్వేర్‌ హౌసింగ్‌ సీఈఓ శ్రీ ఈశ్వర్‌ ఎన్‌ మాట్లాడుతూ, ‘‘దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లలో తెలంగాణా ఒకటి. భారీ టెక్నాలజీ సంస్థలన్నీ కూడా తమ క్యాంపస్‌లను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల అద్భుతమైన వృద్ధికి అవకాశాలున్నాయి. దక్షిణ భారతదేశంలో పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను మేము అభివృద్ధి చేశాము. తెలంగాణా మార్కెట్‌లో సైతం ప్రవేశించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వద్ద మా నూతన కార్యాలయం తెరిచాము. ఈ నెలాఖరు నాటికి 200 మంది ఉద్యోగుల సంస్థగా నగరంలో నిలువనున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం