Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులపై ఆ సుంకం..?

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (09:12 IST)
వంట నూనెలపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులపై రాయితీతో కూడిన దిగుమతి సుంకాల ప్రయోజనాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 
 
వచ్చే ఏడాది మార్చి చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఆగస్ట్ 31 నుంచి ఈ రాయితీ దిగుమతి సుంకాలను అమలులోకి తీసుకువచ్చింది. 
 
దేశీ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్స్ సరఫరా పెరగాలని, దీని వల్ల రిటైల్ ధరలు అదుపులో ఉండాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ గడువును వచ్చే ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
 
సీబీఐసీ తీసుకువచ్చిన రాయితీతో కూడిన దిగుమతి సుంకాలు ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్‌పై 2023 మార్చి వరకు కొనసాగుతాయని ఫుడ్ మినిస్ట్రీ తెలిపింది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగి వచ్చాయని, అందువల్ల దేశీ మార్కెట్‌లో కూడా కుకింగ్ ఆయిల్ రేట్లు తగ్గుతూ వస్తున్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments