Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో విజయవంతమైన బి2బి సమావేశాలను నిర్వహించిన ఫిక్కీ

ఐవీఆర్
మంగళవారం, 24 జూన్ 2025 (23:08 IST)
విజయవాడ: యుఏఈలోని షార్జా ప్రభుత్వ షార్జా ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్రీ జోన్(సైఫ్ జోన్) భాగస్వామ్యంతో, భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ), యుఏఈ ద్వారా ప్రపంచ మార్కెట్లలోకి భారతీయ వ్యాపారాలు విస్తరించడంలో సహాయపడే లక్ష్యంతో విజయవాడలో ప్రత్యేక బి2బి సమావేశాల శ్రేణిని విజయవంతంగా నిర్వహించింది.
 
ఈ సమావేశాలు విస్తృత శ్రేణిలో మధ్యప్రాచ్య, ఆఫ్రికా, మధ్య ఆసియా, రష్యాలో వాణిజ్యం, వ్యాపార అవకాశాలను గురించి అవగాహన అందించాయి. ప్రపంచ మార్కెట్లలో వ్యాపారాలను విస్తరించడంతో పాటుగా ఎగుమతులు, ఇరు దేశాల నడుమ కార్యకలాపాలను పెంచడానికి భారతదేశం-యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)ను ఉపయోగించడంపై కూడా వారు మార్గదర్శకత్వం అందించారు.
 
స్థానిక వ్యాపార సంస్థలు యుఏఈ నుండి ఇతర దేశాలలో కార్యకలాపాలను నిర్వహించటం వల్ల, ముఖ్యంగా ఈ ప్రాంతంలోని అత్యంత సమర్థవంతమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన ఫ్రీ జోన్‌లలో ఒకటి అయిన సైఫ్ జోన్ ద్వారా కలిగే ప్రయోజనాలను అన్వేషించడానికి ఒక వ్యూహాత్మక వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.  
 
అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులలో భారతదేశం యొక్క విస్తరిస్తున్న పాత్రకు అనుగుణంగా, భారతీయ వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి వీలు కల్పించే వేదికలను ఫిక్కీ నిర్మిస్తూనే ఉంది. విజయవాడ నుండి 70కి పైగా కంపెనీలు ఈ బి2బి  సమావేశాలలో పాల్గొన్నాయి. ఇంజనీరింగ్ వస్తువులు, ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు, లాజిస్టిక్స్, ఐటి సేవలు వాణిజ్య రంగాల నుంచి  ఇవి ఉన్నాయి. విస్తృత మధ్యప్రాచ్యం, ఆఫ్రికా-మధ్య ఆసియా మార్కెట్లలోకి ప్రవేశించడానికి, యుఏఈలో కార్యకలాపాలు, ప్రతినిధి కార్యాలయాలను ఏర్పాటు చేయడం పట్ల పలు కంపెనీలు ఆసక్తిని కనబరిచాయి.
 
సదస్సులో పాల్గొన్న వారు యుఏఈలో కంపెనీ రిజిస్ట్రేషన్, గిడ్డంగులు, సులభంగా వాణిజ్యం చేసుకోవడం  కోసం అందించే సేవలపై ఫాలోఅప్‌లను కోరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడానికి భారతదేశం-యుఏఈ సేపా యొక్క ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి సరైన వేదికగా ఈ కార్యక్రమంకు మంచి స్పందన లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments