Webdunia - Bharat's app for daily news and videos

Install App

EPFO update:24 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (17:17 IST)
దాదాపు 24 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త చెప్పేందుక  కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈపిఎఫ్‌వో యొక్క అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మార్చిలో జరిగే సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2021-22కు పెంచవచ్చని తెలుస్తోంది.  
 
వచ్చే నెలలో జరిగే ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటు నిర్ణయించబడుతుంది. 2021-22 వడ్డీరేట్లను నిర్ణయించే ప్రతిపాదన చర్చకు గౌహతి వేదిక కానుంది. ఈపీఎఫ్‌వో సిబిటి సమావేశం మార్చిలో జరుగుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. 
 
ఈపీఎఫ్‌వో 2021-22 వడ్డీరేటు 2020-21 మాదిరిగా 8.5% వద్ద ఉంటుందా అని ఇటీవల మీడియా అడిగినప్పుడు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయం ఆధారంగా వడ్డీరేటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు భూపేంద్ర తెలియజేశారు.  
 
ప్రస్తుత సంవత్సరానికి వడ్డీరేట్లపై సిబిటి నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫార్వర్డ్ చేస్తారు. మార్చి 2020లో, ఈపిఎఫ్‌వో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 8.5%కు తగ్గించింది, ఇది 7 సంవత్సరాలలో కనిష్ట స్థాయిగా పరిగణించవచ్చు.  
 
ఈపిఎఫ్ వో ఇటీవల తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరానికి 24 కోట్లకు పైగా పిఎఫ్ ఖాతాల్లో వడ్డీ నిజమచేసినట్లు తెలియజేసింది. ఇది 8.5% వడ్డీ రేటుపై చేయబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments