Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్డు ధర వింటే గుడ్లు తేలేయాల్సిందే...

దేశవ్యాప్తంగా నిత్యవసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఎక్కువమంది బలవర్ధక, పౌష్టికాహారమైన కోడిగుడ్డును ఆరగించేందుకు అమితాసక్తిని చూపేవారు.

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (14:49 IST)
దేశవ్యాప్తంగా నిత్యవసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఎక్కువమంది బలవర్ధక, పౌష్టికాహారమైన కోడిగుడ్డును ఆరగించేందుకు అమితాసక్తిని చూపేవారు. అయితే, ఈ కోడిగుడ్డు ధర కూడా ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ గుడ్డు ధర వింటే ఖచ్చితంగా గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
సాధారణంగా ధరలు రెండు, మూడు రూపాయలుండే గుడ్డు ధర ఇపుడు ఇప్పుడు ఏకంగా ఆరు రూపాయలకు చేరుకుంది. రిటైల్‌ ధర ఒక్కో గుడ్డుకు ఆరు రూపాయలైంది. ఇన్నాళ్లుగా కూరగాయల ధరలే చుక్కలు చూపిస్తుండగా, ఇప్పుడు గుడ్డుధర కూడా భారంగా మారింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, వినియోగం పెరుగడం దృష్ట్యా మరో రెండునెలలు ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
రోజురోజుకు ధర పెరుగుతూ సోమవారం ఆల్‌టైం రికార్డును తాకింది. ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ధరలు ప్రతి యేడాది  డిసెంబర్ మాసంలో పెరుగుతుంటాయి. కానీ, ఈ యేడాది నవంబరు నెలలోనే గరిష్టస్థాయికి చేరాయి. ఫలితంగా అటు కూరగాయల ధరలు మండిపోవడం, ఇటు కోడిగుడ్డు ధరలు కొండెక్కడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments