Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రయాణం మరింత ప్రియం... ఫ్లైటెక్కాలంటే జేబుకు చిల్లే

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:02 IST)
దేశంలో విమాన ప్రయాణం మరింత ప్రియంకానుంది. ఇకపై ఫ్లైటెక్కాలంటే జేబుకు చిల్లుపడాల్సిందే. దేశీయ విమాన ప్రయాణ టికెట్ ధరలను పది నుంచి 30 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. 
 
గతేడాది మే నుంచి జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన కేంద్రం.. సవరించిన చార్జీలు ఈ ఏడాది మార్చి 31 వరకు , లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
 
సవరించిన చార్జీల ప్రకారం.. ప్రయాణకాలం 40 నిమిషాల వరకు ఉంటే రూ.200 నుంచి గరిష్టంగా రూ.1,800 వరకు, 40 నుంచి 60 నిమిషాల ప్రయాణ కాలానికి రూ.300-రూ.2,700, 90 నిమిషాల వరకు ఉంటే రూ.300-రూ.2,800, 60 నుంచి 90 నిమిషాల వరకు ఉండే ప్రయాణకాలానికి కనిష్టంగా రూ.300 నుంచి గరిష్టంగా రూ.2,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
 
ప్రయాణ కాలం 90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉంటే రూ.400 - రూ.3వేలు, ప్రయాణ కాలం 120 నిమిషాల నుంచి 150 నిమిషాల వరకు ఉంటే రూ.500 - రూ.3,900, 150 నిమిషాల నుంచి 180 నిమిషాల వరకు ఉండే ప్రయాణ కాలానికి కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.4,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ కాలం 180 నిమిషాల నుంచి 210 నిమిషాల వరకు ఉంటే కనిష్టంగా రూ.700 నుంచి గరిష్టంగా రూ.5,600 వరకు చేతి చమురు వదిలించుకోక తప్పదన్నమాటే.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments