భారీగా బంగారాన్ని సేకరిస్తున్న ఆర్బీఐ.. ఎందుకో?

ఠాగూర్
ఆదివారం, 5 జనవరి 2025 (11:08 IST)
భారత రిజర్వు బ్యాంకు బంగారాన్ని భారీగా సేకరిస్తుంది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. గత అక్టోబరు, నవంబరులో మరో 20 టన్నుల బంగారం కొనుగోలు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మొదటి 8 నెలల్లో (ఏప్రిల్-నవంబరు) ఆర్బీఐ 50 టన్నుల బంగారం పోగే సింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ వద్దనున్న మొత్తం బంగారం నిల్వలు 876.18 టన్నులకు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పసిడి ధరలు 10 శాతం మేర పెరిగినప్పటికీ, ఆక్టోబరు - నవంబరు కాలంలో కాస్త నిలకడగానే కొనసాగాయి. దాంతో ఆర్బీఐ కొనుగోళ్లను పెంచింది.
 
విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వల వివిధీకరణ వ్యూహంలో భాగంగానే ఆర్‌బీఐ పసిడి నిల్వలను పెంచుకుంటోంది. ఎందుకంటే, విదేశీ కరెన్సీలు ప్రధానంగా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు మన ఫారెక్స్ నిల్వలపై చూపే ప్రభావాన్ని తగ్గించుకునేందుకు బంగారం నిల్వలు దోహ దపడనున్నాయి. గత నెల 27తో ముగిసిన వారంలో భారత్ వద్ద విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు 411 కోట్ల డాలర్ల మేర తగ్గి 64,027 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు ఆర్బీఐ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments