చిన్నగదిలోంచి వందల కోట్ల లావాదేవీలు.. కనిపెట్టలేని బ్యాంకులు.. ఇదే హవాలాకు లైసెన్స్
మన జాతీయ బ్యాంకులకు అంతర్గత తనిఖీ వ్యవస్థ అంటూ ఒకటి ఏడ్చిందా అంటే సందేహం కలుగుతోంది. ఒక చిన్నగదిలోంచి వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని చెక్కులు రూపంలో తీసుకుని డజనుకు పైగా షెల్ కంపెనీలలో పెట్టుబడి పెట్టి ఆ సొమ్మును సంవత్సరాల తరబడి మరొక దేశీయ బ్యాంకుకు,
మన జాతీయ బ్యాంకులకు అంతర్గత తనిఖీ వ్యవస్థ అంటూ ఒకటి ఏడ్చిందా అంటే సందేహం కలుగుతోంది. ఒక చిన్నగదిలోంచి వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని చెక్కులు రూపంలో తీసుకుని డజనుకు పైగా షెల్ కంపెనీలలో పెట్టుబడి పెట్టి ఆ సొమ్మును సంవత్సరాల తరబడి మరొక దేశీయ బ్యాంకుకు, దాంట్లోంచి విదేశాలకు మళ్లిస్తుంటే దేశీయ బ్యాంకు కానీ, ఆర్బీఐ కానీ పసిగట్టలేకపోయిందంటే హవాలా వ్యాపారానికి ఏది మూలమో అర్థమవుతుంది.
ఇంత దరిద్రంగా మన బ్యాంకింగ్ వ్యవస్థ పనిచేస్తున్న నేపథ్యంలో హవాలా అంటే ఏమిటో తెలీని వాడు కూడా ఆ బిజినెస్ లోకి దిగిపోయే ధైర్యం చేయగలడు. ఉల్లిపాయల వ్యాపారం చేసుకుని బతికే సాధారణ వ్యక్త వందల కోట్ల రూపాయల విలువైన హవాలా రాకెట్‌ను నడిపే స్థాయికి ఎదిగాడంటే ఆశ్చర్యం కలుగుతోంది.
హవాలా యువకుడు మహేష్ గురించి ఆరా తీస్తున్న ఐటీ, పోలీస్ అధికారులకు విస్తుపోయే విషయాలెన్నో తెలుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురంలో పుట్టి, ఉల్లిపాయల వ్యాపారం చేసుకుని బతికే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహేష్ రూ.వందల కోట్ల హవాలా రాకెట్‌ను నడిపే స్థాయికి ఎదిగాడు. శ్రీకాకుళంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ స్టోన్ క్రషింగ్ మిషన్ నడుపుతున్నట్లు జనాన్ని నమ్మించి కోల్‌కతా నుంచి హవాలా నడిపిస్తున్నాడు. వ్యక్తుల స్థాయిలో కూడా ఇలా వందల కోట్లు హవాలా రాకెట్ ఎలా నడపగలరు అంటే...
కోల్‌కతా నుంచి విశాఖ బ్యాంకు అకౌంట్లకు నగదును మళ్లించి ఇక్కడినుంచే సింగపూర్, చైనా, హాంకాంగ్ దేశాలకు తరలించి మహేష్ ద్వారా హవాలా చేస్తున్నారు. నల్లధనాన్ని చెక్కుల రూపంలో తీసుకుని 12 షెల్ కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ సొమ్మును మరికొన్ని కంపెనీల్లోకి మళ్లిస్తున్నారు. విశాఖలోని 22 బ్యాంకుల్లో తప్పుడు పత్రాలతో ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయలు వాటిలో జమచేస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు పంపి స్తున్నారు. ఇలా ఒకే బ్యాంకు అకౌంట్‌లో వివిధ అకౌంట్ల నుంచి రూ.570 కోట్లు జమ అయినప్పటికీ అధికారులకు అనుమానం రాలేదు. ఆ ధైర్యంతోనే మరో రూ.97 కోట్లు అదే ఖాతాలో జమచేశారు. అప్పుడు మాత్రమే వాటిని చూసిన అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు.
మహేష్ లావాదేవీలపై నెల రోజుల పాటు నిఘా పెట్టా రు. ఈ నెల 9న రంగంలోకి దిగి షెల్ కంపెనీల కోసం జల్లెడ పట్టారు. బెంజ్ కారు కొనుగోలు చేయడానికి ఖాతా నుంచి డబ్బులు తీయడంతో మహేష్ గుట్టు కనిపెట్టారు. తొలుత అతని తండ్రి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మహేష్‌ను అదుపులోకి తీసుకుని విశాఖ తీసుకు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలికి చెందిన అన్న దమ్ములు రాజేష్, హరీష్‌లను కూడా అదుపులోకి తీసుకు న్నారు. వీరందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఇంత భారీగా నల్లధనాన్ని మార్పిడి వెనక కచ్చితంగా చాలా పెద్దవాళ్ల హస్తమే ఉంటుందని ఐటీ శాఖ ఉన్నతాధికారి అన్నారు.