Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ విమానాలపై జులై 31 వరకు నిషేధం

Webdunia
గురువారం, 1 జులై 2021 (12:53 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్టి గత యేడాది మార్చి 25వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా గత 16 నెలలుగా ఈ విమాన సర్వీసలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు ఈ విమానాలపై నిషేధం విధించింది. ఈ నిషేధం జూలై 31వ తేదీ వరకు కొనసాగనుంది. 
 
దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గతేడాది మార్చి నుంచి కొనసాగుతున్న ఈ నిషేధాన్ని జులై 31 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటన చేసింది. 
 
అంతర్జాతీయ విమానాలపై జులై 31 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన డీజీసీఏ.. కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది. అయితే.. ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రం అనుమతించిన విమానాల రాకపోకలను ప్రాధాన్య క్రమంలో అధికారుల అనుమతితో నడపవచ్చని డీజీసీఏ తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments