కరోనా వైరస్ ప్రపంచ దేశాల వాణిజ్యంపై ప్రభావం చూపింది. ముఖ్యంగా భారత్‍లో కరోనా భయంతో మాంసాహారం తినడం మానేశారు ప్రజలు. ఇంకా చికెన్ జోలికి అస్సలు పోవట్లేదు. దీంతో చికెన్ ధరలు మార్కెట్లో దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం కేజీ చికెన్ ధర అరవై రూపాయలే పలుకుతోంది.
చికెన్ తింటే కరోనా వ్యాధి వస్తుందని.. సోషల్ మీడియా వ్యాప్తంగా పలు పుకార్లు ఫుల్లుగా ట్రోల్ అవుతున్నాయి. దీని కారణంగా పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యాపారులు తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తున్నారు.
అయితే కరోనా ఎఫెక్ట్‌తో చికెన్ అమ్మకాలు పడిపోయినా.. మటన్ షాపులు మాత్రం కళకళలాడుతున్నాయి. కరోనా భయంతో చాలా మంది మాంసాహారులు మేకలు, గొర్రెల మాంసం వైపు మొగ్గు చూపుతున్నారు.
చికెన్‌కి కరోనా వైరస్‌కి మధ్య ఎటువంటి సంబధం లేదని చెప్తున్నా జనాలు మాత్రం జడుసుకుంటున్నారు. అంతేగాకుండా, మాంసాన్ని బాగా ఉడికించుకుని తినాలని వైద్యులు సెలవిస్తున్నారు.