Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ బాదుడు... వచ్చే మార్చి నాటికి సబ్సీడీ ఎత్తివేత

చమురు కంపెనీలు మళ్లీ వంట గ్యాస్ ధరను పెంచాయి. వచ్చే యేడాది మార్చి నాటికి రాయితీలను పూర్తిగా తొలగించేందుకు వీలుగా ప్రతి నెలా కొంతమేర ధరలు పెంచుతూ వెళ్లాలని గత యేడాది కేంద్రం నిర్ణయించింది.

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (11:50 IST)
చమురు కంపెనీలు మళ్లీ వంట గ్యాస్ ధరను పెంచాయి. వచ్చే యేడాది మార్చి నాటికి రాయితీలను పూర్తిగా తొలగించేందుకు వీలుగా ప్రతి నెలా కొంతమేర ధరలు పెంచుతూ వెళ్లాలని గత యేడాది కేంద్రం నిర్ణయించింది. దీన్ని ఓ అవకాశంగా తీసుకున్న చమురు కంపెనీలు గత యేడాది కాలంలో ఇప్పటివరకు 19 సార్లు వంట గ్యాస్ ధరను పెంచాయి. 
 
తాజాగా, సబ్సిడీ సిలిండర్‌ ఒక్కింటికి రూ.4.50 పెంచారు. ఈ పెంపుదలతో ధర రూ.495.69కు పెరిగింది. నాన్‌-సబ్సిడీ సిలిండర్‌ ధరను రూ.93 పెంచగా రూ.742కు చేరింది. ఇలా ధరలు పెంచడం ఇది 19వ సారి. గత ఏడాది జూన్‌లో 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.419.18గా ఉంది. అంటే ఇప్పటికి రూ.76.51 పెరిగింది. ఇక నాన్‌-సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర గత అక్టోబరులో రూ.50 పెంచారు. దాంతో రూ.649కి చేరింది. తాజా పెంపుతో రూ.742 అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments