Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ ధర బాదుడే బాదుడు.. పక్షం రోజుల వ్యవధిలో...

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (11:52 IST)
దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం పెట్రోల్ ధరలు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. తాజాగా వంట గ్యాస్ ధర కూడా పెరగడం మొదలుపెట్టింది. గత 15 రోజుల్లో రెండుసార్లు వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు పెంచేశాయి. 
 
తాజాగా కోట్లాది మంది ఉపయోగించే సబ్సీడీ గ్యాస్ ఒక సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. పెంచిన ధరలతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ రాయితీ సిలిండర్ ధర రూ.694కు చేరింది.
 
ఈ నెల 2కి ముందు హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా రాయితీ సిలిండర్ ధరను పెంచిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు సిలిండర్ ధర రూ.696.5గా ఉంది. ఇప్పుడు మరో రూ.50 పెరిగింది. 
 
ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర ఇంతవరకు ముందు రూ.644గా ఉంది. భారత్‌లోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉంటున్న విషయం తెల్సిందే. దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులే. 
 
ఇకపోతే, సబ్సీడీయేతర సిలిండర్ ధరను కూడా రూ.36.50గా పెచారు. ప్రస్తుతం 14.2 కేజీల బరువున్న సిలండర్ ధర ఢిల్లీలో రూ.644గా చేరింది. అలాగే, కోల్‌కాతాలో ఈ ధర రూ.670.50, ముంబైలో రూ.644, చెన్నైలో రూ.660గా ఉంది. గత వారం రోజుల వ్యవధిలో సిలిండర్ ధర రూ.100 పెరిగింది. 
 
గతంలో రాయితీలేని సిలిండర్ ధర ఢిల్లీలో రూ.594గాను, కోల్‌కతాలో రూ.620.50గాను, ముంబైలో రూ.594గాను, చెన్నైలో రూ.610గా ఉండేది. అలాగే, 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా రూ.54.50 చొప్పున పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments