Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ పాలనలో కార్పొరేటర్లకు రూ.6 లక్ష కోట్ల పన్నుల మినహాయింపు!

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (08:36 IST)
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలోని కార్పోరేటర్లు సుభిక్షంగా ఉన్నారు. అన్ని రకాల ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింలు లభిస్తున్నాయి. ఫలితంగా దేశంలోని పెట్టుబడిదారులంతా సంతోషంగా జీవిస్తున్నారు. దీనికి నిదర్శనమే గత ఆరేళ్ళ కాలంలో ఏకంగా 6 లక్షల కోట్లకు పైగా పన్నులు మినహాయించినట్టు కేంద్రం వెల్లడించింది. 
 
గత ఆరేళ్ళ కాలంలో దేశంలోని కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపుల రూపంలో రూ.6,07,583.04 కోట్లను మినహాయించినట్లు మంగళవారం రాజ్యసభలో సీపీఐ (ఎం) ఎంపీ కెకె రాగేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 
 
ఇందులో 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,15,176.50 కోట్లు, 2016-17లో రూ.1,30,184.41 కోట్లు, 2017-18లో రూ.1,20,069.67 కోట్లు, 2018-19లో రూ.1,25,891.78 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,16,260.68 కోట్లు దేశంలోని పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 
 
అయితే, ఆదాయ పన్ను చట్టం-1961 ప్రకారమే కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన వివరించారు. దేశంలో ప్రాంతీయ అసమానతలను తొలగించే చర్యల్లో భాగంగా పెట్టుబడిదారులకి కార్పొరేట్‌ ట్యాక్స్‌ మినహాయింపులిచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments