Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న పంజాబ్ నేషనల్.. నేడు ఓరియంటల్... బ్యాంకును ముంచిన మరో వజ్రాల వ్యాపారి

దేశంలో వజ్రాల వ్యాపారుల బండారం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. నిన్నటికినిన్న సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏకంగా రూ.11 వేల కోట్ల మేరకు రుణాలు తీసుకుని ఒక్కపైసా కూడా

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (15:21 IST)
దేశంలో వజ్రాల వ్యాపారుల బండారం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. నిన్నటికినిన్న సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏకంగా రూ.11 వేల కోట్ల మేరకు రుణాలు తీసుకుని ఒక్కపైసా కూడా చెల్లించకుండా విదేశాలకు పారిపోయాడు. 
 
ఇపుడు మరో వజ్రాల వ్యాపారి మోసం బయటపడింది. ఆ వ్యాపారి పేరు ద్వారాకా దాస్ సేథ్. ఈయన ఓరియంటల్ బ్యాంకు నుంచి ఏకంగా రూ.389 కోట్ల మేరకు రుణాలు తీసుకుని చెల్లించలేదు. దీంతో బ్యాంక్.. ఆయనపై సీబీఐకి కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు.
 
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు దాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.389 కోట్లు తీసుకుని చెల్లించలేదు. 2007 నుంచి 2012 మధ్య ఐదేళ్ల కాలంలో ద్వారకా దాస్ సేథ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.389 కోట్లు అప్పు తీసుకుంది. తీసుకోవటమే కానీ.. ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదు. కనీసం పైసా వడ్డీ కూడా చెల్లించలేదు. 
 
ఈయన డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ పేరుతో ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో బంగారం, వజ్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అప్పు తీసుకుని చెల్లించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కంపెనీ డైరెక్టర్లు సభ్యసేథ్, రీటాసేథ్, కృష్ణకుమార్ సింగ్, రవి సింగ్‌లపై కేసు నమోదు అయ్యింది. ఒక్క బ్యాంకులోనే ఇలా చేశారా.. మిగతా బ్యాంకుల్లోనూ అప్పులు చేశారా అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments